బిగ్‌బాస్ హోస్ట్‌గా నాగ్ ఔట్.. షో వాయిదా!?

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్-3 మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుండగా నిర్వాహకులకు ఊహించని షాక్ తగిలింది. వరుస వివాదాల నేపథ్యంలో హోస్ట్‌గా ఉన్న టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున తప్పుకునే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ విషయం తెలుసుకున్న ‘మా టీవీ’ ప్రతినిధులు నాగ్ ఇంటికెళ్లి బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది. 

రేపు అనగా ఆదివారం (జులై-21) నుంచి షో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగ్ ఇలా చేయడంతో షో నిర్వాహకులు దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారని తెలుస్తోంది. కాగా షోను వాయిదా పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతోంది.

ఇప్పటికే బిగ్‌బాస్ షో నిలిపేయాలని పలు కేసులు పోలీస్ స్టేషన్లలో నమోదవ్వగా.. తెలంగాణ హైకోర్టులో పిల్ సైతం దాఖలు చేశారు. మరోవైపు ఈ షోను ఆపి తీరాల్సిందేనని ఉస్మానియా విద్యార్థులు అక్కినేని నాగార్జున ఇంటిని ముట్టడించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని నిలువరించి.. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే ఈ వివాదాల నేపథ్యంలో నాగ్ హోస్ట్‌గా తప్పుకోవాలని కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

Akkineni Nagarjuna out from bigg boss-3:

Akkineni Nagarjuna out from bigg boss-3


LATEST NEWS