‘సాహో’ ఆగస్ట్ 30కి వెళ్లింది అందుకే..!

ఆగ‌స్ట్ 30న ప్ర‌పంచ‌వ్యాప్తంగా యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టించిన మోస్ట్ ఎవైటెడ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సాహో’ 

బాహుబలి చిత్రం తర్వాత  ప్ర‌పంచ సినిమా బాక్సాఫీస్ ఒక్క‌సారిగా యంగ్ రెబల్‌స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న ‘సాహో’ చిత్రం వైపుకి మళ్ళిన విష‌యం తెలిసిందే. ఇండియాలో మొట్ట‌మొద‌టిగా అత్యంత భారీ బ‌డ్జెట్‌తో హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జీతో తెరెకెక్కుతోన్న ఈ చిత్రం ఆగ‌స్ట్ 15న భార‌తదేశ స్వాతంత్ర్య దినోత్సవం సంద‌ర్బంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లకి నిర్మాత‌లు స‌న్నాహాలు చేశారు. బాహుబలి లాంటి చిత్రం త‌రువాత వ‌స్తున్న చిత్రం కావ‌టంతో రెబ‌ల్‌స్టార్ ఫ్యాన్స్ తో పాటు ఇండియ‌న్ సినిమా ల‌వ‌ర్స్ అంద‌రూ ఈ సినిమాపై భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. దీంతో మేక‌ర్స్ ఎక్క‌డా చిన్న విష‌యంలో కూడా కాంప్ర‌మైజ్ కాకుండా ఆడియ‌న్స్‌కి పూర్తి వినోదాన్ని క్లారిటి ఆఫ్ క్వాలిటీతో అందించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. హైస్టాండ‌ర్డ్ వి‌ఎఫ్‌ఎక్స్‌ని యూజ్ చేయ‌టం వ‌ల‌న హ‌డావుడి కాకుండా ప్ర‌పంచ‌వ్యాప్తంగా వున్న సినిమా ల‌వ‌ర్స్ ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రానికి సంబంధించిన వ‌ర్క్ జ‌రుగుతుంది. అందుకే ఇండిపెండెన్స్‌డే లాంటి మంచి డేట్ ని కూడా మేక‌ర్స్ వ‌దులుకుని ఆగ‌స్ట్ 30న ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. పూర్తి క్రిస్ట‌ల్ క్లారిటీగా యంగ్ రెబ‌ర్‌స్టార్ ఫ్యాన్స్ ఫిదా అయ్యేలా ఈ సాహో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది.  

ఈ సంద‌ర్బంగా నిర్మాత‌లు వంశీ-ప్ర‌మోద్‌-విక్ర‌మ్‌లు మాట్లాడుతూ.. ‘‘మా బ్యాన‌ర్‌లో వ‌చ్చిన అన్ని చిత్రాలు క్వాలిటీకి కేరాఫ్‌గా వ‌చ్చాయి. మ‌రి ఇప్పుడు యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ హీరోగా సాహో లాంటి చిత్రాన్ని చేస్తున్నాము అది కూడా బాహుబ‌లి అనే ల్యాండ్ మార్క్ చిత్రం త‌రువాత వ‌స్తున్న చిత్రం కావ‌టం సినిమా ప్రేక్ష‌కులంద‌రూ అంచ‌నాలు అందుకోవాలి అందుకే చిన్న విష‌యంలో కూడా కాంప్ర‌మైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించాము. వి‌ఎఫ్‌ఎక్స్ కూడా అదే రేంజ్‌లో వుండేలా కేర్ తీసుకుంటున్నాము. ఇంత లార్జ్ స్కేల్‌తో వ‌స్తున్న చిత్రాన్ని ప్రేక్ష‌కుల‌కి బెస్ట్‌గా ఇవ్వాల‌న్న మా ప్ర‌య‌త్నం కొంచెం ఆల‌స్య‌మైనా బెస్ట్ ఇచ్చి తీరాల‌ని నిర్ణ‌యించుకున్నాం. ఆగ‌స్ట్ 30న ఈ చిత్రాన్ని ప్ర‌పంచంలో వున్న సినిమా ల‌వ‌ర్స్‌కి అందిస్తున్నాము..’’ అని అన్నారు

న‌టీన‌టులు.. యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్, శ్రధ్ధాక‌పూర్‌, జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్‌, అరుణ్ విజ‌య్‌, లాల్‌, వెన్నెల కిషోర్‌, ప్ర‌కాష్ బెల్వాది, ఎవిలిన్ శ‌ర్మ‌, చుంకి పాండే, మందిరా బేడి, మ‌హేష్ మంజ్రేఖ‌ర్‌, టిను ఆనంద్‌, శ‌ర‌త్ లోహిత‌ష్వా త‌దిత‌రులు.

Saaho Release on August 30th:

This is the reason for Saaho Release postpone


LATEST NEWS