‘మన్మథుడు’ రేంజ్‌తో రాహుల్ మతిపోతోంది!

నటుడుగా అవకాశాలు లేని రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంపై దృష్టి పెట్టాడు. మొదటి సినిమా చి.ల.సౌ తోనే హిట్ కొట్టాడు. సుశాంత్ హీరోగా చేసిన చి.ల.సౌ సినిమాతో రాహుల్ కి మంచి పేరొచ్చింది. డీసెంట్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఆ సినిమా అడివి శేష్ గూఢచారితో పోటీ పడడంతో.. హిట్ అయినా కలెక్షన్స్ సాధించలేదు. ఇక రెండో సినిమాకే నాగార్జున లాంటి హీరో ఆఫర్ ఇవ్వడం.. నాగ్‌తో మన్మథుడు 2 ని పట్టాలెక్కించిన రాహుల్.. వాయు వేగంగా మన్మథుడు 2 ని చుట్టేశాడు. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న మన్మథుడు ఆగష్టు 9న విడుదల కాబోతుంది. నాగార్జున చేతిలో పడిన రాహుల్ కి దర్శకుడిగా పేరు రావడం ఖాయం. మన్మథుడు 2 ని బోల్డ్ కంటెంట్ అంటే.. రొమాంటిక్ అండ్ లిప్ కిస్ సీన్స్ తో యూత్ ని ఆకట్టుకునేలా ఈ సినిమాని తీసాడనేది మన్మథుడు 2 టీజర్స్ తో అర్ధమయ్యింది.

అయితే రాహుల్‌కి నాగార్జున తగలడం ఒక ఎత్తు అయితే.. ఇప్పుడు ఈసినిమా బిజినెస్ పరంగాను నాగ్ క్రేజ్ తో రాహుల్ కి కలిసొచ్చింది. నాగార్జున - జెమిని కిరణ్ నిర్మాతలుగా మన్మథుడు 2 తెరకెక్కింది. మరి నాగ్ వ్యాపార పరంగా ఎంతగా స్ట్రిట్ గా ఉంటాడో తెలుసు. ఇక సినిమాని బిజినెస్ చేయడంలోనూ నాగ్ నేర్పరి. తాజాగా మన్మథుడు 2 నాన్ థియేట్రికల్ రైట్స్ ని నాగ్ 24 కోట్ల మేర అమ్మేసాడనే టాక్ వినబడుతుంది. మన్మథుడు 2 శాటిలైట్, డిజిటల్ అండ్ హిందీ రైట్స్ ని 24 కోట్లమేర బిజినెస్ చేసినట్లుగా తెలుస్తుంది. మరి రాహుల్ రెండో సినిమాకే ఈ రేంజ్ నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడు పోవడం మాత్రం ఖచ్చితంగా నాగ్ క్రేజే కారణం. మరి రెండో సినిమాకే ఇలాంటి భారీ బిజినెస్ జరగడం రాహుల్ దర్శకత్వ కెరీర్ కి బలమే. ఈ రేంజ్ లో థియేట్రికల్ బిజినెస్ కూడా జరిగితే రాహుల్ మూడో సినిమా భారీ బడ్జెట్ తో నిర్మించొచ్చు. మరి బిజినెస్ కి సరిపోయేలా మన్మథుడు 2 హిట్ కావాలి కదా..!

Shocking Non Theatrical Business to Manmadhudu 2 :

Rahul Ravindran Happy with Manmadhudu 2 Business  


LATEST NEWS