మైత్రీ వరుస చూస్తే మతి పోవాల్సిందే!

ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ వారు. మీడియం రేంజ్ సినిమాలు నుండి పెద్ద సినిమాల వరకు ఏ సినిమాని వదలడం లేదు. ముఖ్యంగా స్టార్ హీరోస్ ని ముందుగానే అడ్వాన్స్ లు ఇచ్చి లాక్ చేస్తున్నారు. అయితే భారీ చిత్రాలు నిర్మించాలని డిసైడ్ అయిన ఈ సంస్థ మరో భారీ ప్రాజెక్ట్స్ కు రంగం సిద్ధం చేస్తుంది.

ప్రస్తుతం చిరంజీవి, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లతో సినిమాలు చేస్తున్న మైత్రి సంస్థ ఓ భారీ స్కెచ్ వేసింది. మెగాస్టార్ చిరంజీవితో ఓ భారీ సినిమా చేయనున్నారు మైత్రి వారు. ప్రస్తుతం ప్రాసెస్ లో ఉన్న ఈ కథ త్వరలోనే చిరంజీవికి వినిపిస్తాం ఆయన ఓకే అంటే వెంటనే స్టార్ట్ చేస్తాం. కథ విషయంలో నాకు కాన్ఫిడెన్స్ ఉంది. అయితే దర్శకుడు ఎవరు అనేది అప్పుడే చెప్పలేను అని మైత్రి మూవీస్ అధినేత నవీన్ అన్నారు.

అలానే 2020లో మహేష్ తో సినిమా ఉంటుందని నవీన్ ఎర్నేని తెలిపారు. మహేష్ ని డైరెక్ట్ చేసే డైరెక్టర్ పేరు కూడా చెప్పలేదు నవీన్. త్రివిక్రమ్ తో 2012 లోనే సినిమా చేయాలనీ డిలే అయ్యింది సో ఆయనతో చేస్తున్నాం అని అన్నారు. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో సినిమా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు అని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అలానే ఎన్టీఆర్- కేజీఎఫ్ డైరెక్టర్ సినిమాని మైత్రి అధినేత నవీన్ కన్ఫామ్ చేశారు. విజయ్ దేవరకొండతో మరో సినిమా చేస్తున్నాం అని కంఫర్మ్ చేసారు.  దానికి హీరో అనే టైటిల్ కూడా పెట్టాం. ఇలా స్టార్ హీరోస్ సినిమాలతో మరో ఐదేళ్ల పాటు కాల్షీట్లు ఖాళీ లేవు అన్నట్టు చెబుతున్నారు నవీన్.

Mythri Movie Makers plans Movies with Star Heroes:

Mythri Movie Makers Next Films Update


LATEST NEWS