డైరెక్టర్ వద్దన్నా నేనే న్యూడ్‌గా చేశా: హీరోయిన్

 

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ అమలాపాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఆమె’. ఈ నెల 19న అభిమానుల ముందుకు ఈ సినిమా రాబోతోంది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్‌లుక్, టీజర్ సినిమాపై అంచనాలు భారీగానే పెంచేశాయి. ఈ టీజర్ రిలీజ్ అయినప్పుడు ‘ఆమె’ యూ ట్యూబ్‌ను ఓ ఊపు ఊపేసింది. మరీ ముఖ్యంగా ఇందులో అమలాపాల్ బోల్డ్‌గా ఉండటంతో కుర్రకారు ఎగబడి మరీ చూశారు.

ఈ టీజర్‌పై పలువురు విమర్శలు గుప్పించినప్పటికీ.. అమలాపాల్ డేరింగ్‌ను మెచ్చుకున్న వాళ్లే ఎక్కువగా ఉన్నారు. వాస్తవానికి అమలాపాల్ నటించమంటే జీవించేస్తుంది.. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఉన్నట్టుండి అమల ఇలా బోల్డ్ సినిమాలో నటించడంతో అభిమానులు, సినీ ప్రియులు అందరూ షాక్ తిన్నారు.

ఇక అసలు విషయానికొస్తే.. ఈ సినిమాలోని కొన్ని బోల్డ్ సీన్స్‌ను తెరకెక్కించేటప్పుడు ‘స్కిన్‌ కలర్ డ్రెస్’ వేసుకుని చేయండని డైరెక్టర్ సలహా ఇచ్చారట. అయితే అస్సలు ఒప్పుకోని అమలా.. తాను నిజంగానే న్యూడ్‌గా చేస్తానంటూ పట్టుబట్టి మరీ చేసిందట. ఇందుకు కారణం సినిమా మొత్తానికి ఆ ఒక్క సీనే ప్రధానం కాబట్టి అలా చేశానని ఇటీవల ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అమలాపాల్‌ కష్టాన్ని సినీ ప్రియులు, ఫ్యాన్స్ ఏ మాత్రం ఆదరిస్తారో వేచి చూడాల్సిందే మరి.

Amala Paul opens up on doing a nude scene in ‘Aadai’:

Amala Paul opens up on doing a nude scene in ‘Aadai’  


LATEST NEWS