బాలీవుడ్‌కు ‘ఓ బేబీ’.. సామ్ పాత్రలో ఎవరంటే..!

టాలీవుడ్‌ టాప్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నందినిరెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘ఓ బేబీ’. లేడీ ఓరియెంటెడ్ సినిమా కదా.. ఏం ఆడుతుందో ఏమో అని అందరూ అనుకున్నారు కానీ.. అనుకున్నదానికంటే రెట్టింపుగా సినిమా ఆడి.. ప్రస్తుతం అటు మిగతా సినిమాలకంటే.. ఇటు కలెక్షన్ల పరంగా రెండింటిలోనూ టాప్‌లో ఉంది. జులై 05న థియేటర్లలోకి ‘బేబీ’ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.

ఓ డెబ్బైయేళ్ల వృద్దురాలు..అనుకోకుండా యంగ్ మారితే జరిగిన పరిణామాల నేపథ్యంలో ‘ఓ బేబీ’ తెరకెక్కిన ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకుని ప్రశంసలు అందుకుంటోంది. అయితే ఈ సినిమాపై కన్నేసిన బాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ రీమేక్ చేయాలని భావిస్తోందట. అంతేకాదండోయ్.. ఈ రీమేక్‌లో సురేష్ ప్రొడక్షన్స్‌ను కూడా కలుపుకుని సంయుక్తంగా నిర్మించాలని భావిస్తున్నారట.

సమంత పాత్రలో ఎవరు నటిస్తారన్నదానిపై సుమారు రెండ్రోజులపాటు పరిశీలించిన సదరు నిర్మాణ సంస్థ.. ఫైనల్‌గా కంగనా రనౌత్ లేదా అలియా భట్‌ను తీసుకోవాలని యోచిస్తున్నారట. టాలీవుడ్‌లో ఓ ఊపు ఊపిన బేబీ.. బాలీవుడ్‌లో ఏ మేరకు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందో వేచి చూడాల్సిందే మరి.

Samantha Akkineni starrer Oh Baby to be remade in Hindi?:

Samantha Akkineni starrer Oh Baby to be remade in Hindi?


LATEST NEWS