సామ్‌తో ఈసారి థ్రిల్లర్ ప్లాన్ చేస్తున్నారు

అక్కినేని సమంత - నందిని రెడ్డిలు మంచి ఫ్రెండ్స్ అనేది అందరికి తెలిసిన విషయమే. వీరి కాంబినేషన్‌లో గతంలో ‘జ‌బ‌ర్‌ద‌స్త్‌’ అనే సినిమా వచ్చింది. అది డిజాస్టర్ అవ్వడంతో మళ్లీ వీరి కాంబినేషన్‌లో సినిమా రాలేదు. డైరెక్టర్ నందిని రెడ్డి ‘క‌ల్యాణ వైభోగ‌మే’తో తిరిగి ఫామ్ లోకి రావడంతో ఆమెకు ‘మిస్ గ్రానీ’ని రీమేక్ చేసే బాధ్య‌త ఇచ్చింది సామ్.

ఈ సినిమా సూపర్ హిట్ అయింది. దాంతో ఇద్దరికీ మంచి పేరు వచ్చింది. అయితే మరోసారి ఈ కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశముందని చెబుతున్నారు. వీరిద్ద‌రి కాంబోలో హ్యాట్రిక్ సినిమా రాబోతోంద‌ని టాక్‌. ఓ బేబీ చిత్ర షూటింగ్ అప్పుడే సామ్.. ఈ సినిమా హిట్ అయితే మనం మరోసారి కలిసి పనిచేద్దాం అని చెప్పిందట.

అయితే సామ్ - నందిని కాంబినేషన్ లో రావాల్సిన చిత్రం కథ కూడా రెడీ అయిపోయిందట. అదొక థ్రిల్ల‌ర్ చిత్ర‌మ‌ని, ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌లోనే చేసే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌తో పాటు సమంత కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగం కానుందని టాక్.

Samantha Again with Nandini Reddy:

Samantha and Nandini Reddy Plans Hat-trick film


LATEST NEWS