విజయవాడలో.. ఇస్మార్ట్ శంకర్

డాషింగ్ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన మాస్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా చిత్రయూనిట్‌ విజయవాడలో సందడి చేశారు. బందరు రోడ్‌లోని గేట్ వే హోటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో రామ్‌తో పాటు హీరోయిన్లు నిధి అగర్వాల్‌, నభా నటేష్‌లు పాల్గొని చిత్ర విశేషాలను వివరించారు.

ఈ సందర్భంగా హీరో రామ్‌ మాట్లాడుతూ.. విజయవాడ రావడం సంతోషంగా ఉందన్నారు. మా సినిమా ట్రైలర్, సాంగ్స్‌కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. పూరీ జగన్నాధ్‌పై ఉన్న నమ్మకంతోనే ఈ చిత్రంలో నటించినట్లు తెలియజేసారు. ఈచిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ నటించారని వారిద్దరు కూడా పోటాపోటీగా నటించారని తెలిపారు. ఈమధ్య కాలంలో ఇద్దరు హీరోయిన్స్‌తో కలిసి నటిస్తున్న చిత్రాలు విజయవంతం అవుతున్నాయని అన్నారు. రామ్, పూరీల సినిమాగా మీడియానే మంచి ప్రచారం ఇస్తోందని చెప్పారు. జగడం తర్వాత నేను పూర్తి స్థాయి మాస్ క్యారెక్టర్ చేసిన సినిమా ఇదేనని తెలిపారు. సినిమాలో క్యారెక్టర్ విధానం‌ బట్టి భాష ఉంటుందని పేర్కొన్నారు.

అనంతరం హీరోయిన్స్ నిధి అగర్వాల్‌, నభా నటేష్‌లు మాట్లాడుతూ.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించడం తమ కెరీర్‌కు ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటించామని తెలిపారు. ఈచిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి తమను ఆశీర్వదించాలని కోరారు.

Ismart Shankar Team Hulchal in Vijayawada:

Ismart Shankar Promotion at Vijayawada


LATEST NEWS