Advertisement

‘కల్కి’ సెన్సార్ పూర్తి


తెలుగు సినిమా ప్రేక్షకులు ఎప్పుడో ఎంక్వయిరీ మొదలుపెట్టారు... ‘కల్కి’ విడుదల ఎప్పుడు? అని ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో అంతలా ఆసక్తి కలిగించాయి. రాజశేఖర్ కథానాయకుడిగా ‘అ!’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కల్కి’. శివాని, శివాత్మిక, ‘వైట్ లాంబ్ టాకీస్’ వినోద్ కుమార్ సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ చిత్రాన్ని నిర్మించారు. శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 28న విడుదల అవుతుండగా... అమెరికాలో ఒక్కరోజు ముందు 27న ప్రీమియర్ షోలు వేస్తున్నారు. ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ లభించింది. 

Advertisement

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా మోషన్ పోస్టర్, టీజర్, కమర్షియల్ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభించింది. కొన్ని గంటల క్రితం విడుదలైన హానెస్ట్ ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కథ ఎలా ఉండబోతుందనేది ఈ ట్రైల‌ర్‌లో చూపించారు. ముఖ్యంగా ట్రైల‌ర్‌లో ‘హనుమంతుడు సాయం మాత్రమే చేస్తాడు. యుద్ధం చేయాల్సింది రాముడే’ డైలాగ్‌ టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ టేకింగ్, ప్రొడక్షన్ వేల్యూస్, శ్రవణ్ భరద్వాజ్ నేపథ్య సంగీతం సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. వీటన్నిటి కంటే ముఖ్యంగా రాజశేఖర్ గారి స్క్రీన్ ప్రజెన్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ‘కల్కి’ పాత్రలో రాజశేఖర్ యాటిట్యూడ్, యాక్టింగ్ హైలైట్ అయ్యాయి. ‘గరుడవేగ’ తర్వాత ‘కల్కి’తో ఆయన మరో హిట్ అందుకోబోతున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

అదా శర్మ, నందితా శ్వేత, పూజితా పొన్నాడ, స్కార్లెట్ విల్సన్, రాహుల్ రామకృష్ణ, నాజర్, అశుతోష్ రాణా, సిద్ధూ జొన్నలగడ్డ, శత్రు, చరణ్ దీప్, వేణుగోపాల్, ‘వెన్నెల’ రామారావు, డి.ఎస్.రావు, సతీష్ (బంటి) ఈ చిత్రంలో ప్రధాన తారాగణం. 

ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర, సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, కథ: సాయితేజ, స్క్రీన్ ప్లే: స్క్రిప్ట్స్ విల్, ఆర్ట్: నాగేంద్ర, ఎడిటర్: గౌతమ్ నెరుసు, స్టిల్స్: మూర్తి, లిరిక్స్: కృష్ణకాంత్ (కె.కె), కాస్ట్యూమ్ డిజైనర్: అదితి అగర్వాల్, ఫైట్స్: నాగ వెంకట్, రాబిన్ - సుబ్బు, ప్రొడక్షన్ కంట్రోలర్: సలన బాలగోపాల్ రావు, చీఫ్ కో-డైరెక్టర్: మాధవ సాయి, లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి, పి.ఆర్.ఓ: నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి, సమర్పణ: శివాని, శివాత్మిక వినోద్ కుమార్, నిర్మాత: సి.కళ్యాణ్, దర్శకత్వం: ప్రశాంత్ వర్మ.

Kalki Censor completed :

Kalki Censor Details
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement