విజయ్ క్రేజ్ తమ్ముడికి పనికొస్తుందా..!!

చిన్న చిన్న కేరెక్టర్స్ తో సినిమాల్లోకి అడుగుపెట్టి ఇప్పుడు స్టార్ రేంజ్ కి చేరాడు విజయ దేవేరకొండ . ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా విజయ్ దేవరకొండ స్టార్ హీరో గా ఎదిగాడు. యాటిట్యూడ్, హీరోయిజం అన్ని విజయ్ కి లక్కులా కలిసొచ్చాయి. ప్రస్తుతం ఫుల్ క్రేజున్న హీరోగా విజయ్ కి అభిమానులు ఏర్పడ్డారు. ఇక విజయ్ కి మరో రెండు హిట్స్ పడ్డాయి అంటే టాలీవుడ్ లో విజయ్ స్థానానికి తిరుగే ఉండదు. తాజాగా విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా విజయ్ అండతో సినిమాల్లోకి వచ్చేసాడు.

ఆనంద్ హీరోగా శివాత్మిక హీరోయిన్ గా దొరసాని సినిమా చేస్తున్నాడు. ఈమధ్యనే దొరసాని సినిమా టీజర్ విడుదలైంది. అయితే విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ గురించి పట్టించుకోవట్లేదనిపిస్తుంది. ఎందుకంటే దొరసాని టీజర్ బావుంది అనికాని.. మరేదో అని కానీ ఒక్క ట్వీట్ కూడా తమ్ముడి కోసం చెయ్యలేదు. ఎప్పుడైనా ఎక్కడైనా తన తమ్ముడు ఆనంద్ కూడా టాలెంట్ ఉంటె పైకొస్తాడని, లక్కుంటే సక్సెస్ అవుతాడని చెబుతున్నాడు కానీ... తన తమ్ముడిని మాత్రం సపోర్ట్ చేస్తూ అతని సినిమా పై ఒక్క మాట కూడా మాట్లాడకుండా గమ్మునుంటున్నాడు. అసలు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవేరకొండ సినిమాని ప్రమోట్ చేసే ఉద్దేశ్యం లేదు. మరి విజయ్ దేవరకొండ ఇమేజ్ ఏమైనా అతని తమ్ముడు ఆనంద్ ని కాపాడాలి. 

Will Devarakonda Brand Help Anand?:

Can Anand Devarakonda Brother Shine With Dorasani?


LATEST NEWS