‘ఇస్మార్ట్ శంక‌ర్‌’‌కే ఝలక్ ఇచ్చాడు

డైరెక్టర్ పూరి దర్శకత్వంతో రామ్ హీరో గా నటిస్తున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’. దాదాపు షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న ఈమూవీకి ఓ కొత్త సమస్య వచ్చి పడింది. చాలా సినిమాల మాదిరిగా ఈ సినిమాకి కూడా లీకేజీల గోల త‌ప్ప‌లేదు. సినిమా రిలీజ్ కి ముందే స్క్రిప్టు మొత్తాన్ని బ‌య‌ట పెట్టేశారు.

లీక్ చేసిన ఆ యువకుడు ఈ స్క్రిప్ట్ మొత్తాన్ని తన ఇన్‌స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేసేశాడు. దాంట్లో సీన్ నెం 1 నుంచి శుభం కార్డు వ‌ర‌కూ డైలాగ్ వెర్ష‌న్‌తో స‌హా అన్నీ ఉన్నాయి. విషయం తెలుసుకున్న పూరి అండ్ ఛార్మి వెంటనే పోలీస్ వారిని ఆశ్ర‌యించారు. మురళి కృష్ణ అనే వ్యక్తి ఈ స్క్రిప్ట్ మొత్తాన్ని లీక్ చేశాడ‌ని పోలీసులు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు.

స్క్రిప్ట్ మొత్తం తన ఇన్‌స్ట్రాగ్రామ్ నుండి తీసేయడానికి భారీగా డబ్బు అడిగాడని ఛార్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సినిమాలో నటించే నటీనటులకు స్క్రిప్ట్ మొత్తం ఇవ్వడం పూరికి అలవాటు అని అలా ఆ స్క్రిప్ట్ చేతులు మారుతూ ముర‌ళీకృష్ణకు చేరింది. పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.

ISmart Shankar Script On Instagram:

ISmart Shankar Script Leaked On Net


LATEST NEWS