ఈ ప్లాప్ జంటతో మళ్ళీ సినిమా!

అక్కినేని నాగ చైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచినా చిత్రం ‘దడ’. ఈ సినిమా టైటిల్ ఏ ముహుర్తాన్న పెట్టారో కానీ అప్పటినుండి ఈ పేరు విన్నప్పుడల్లా చైతు గుండెల్లో దడ పుడుతుంది. అంతలా ఇంపాక్ట్ చేసిన ఈ సినిమా తరువాత చైతు యాక్షన్ మూవీస్ చేయడం మానేసాడు. పైగా ఇది ‘100% లవ్’ ఘనవిజయం సాధించిన తరువాత వచ్చిన సినిమా.

ఈసినిమా తరువాత డైరెక్టర్ కూడా ఇండస్ట్రీలో కనిపించడం మానేసాడు అంటే ఈసినిమా ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. తనతో పని చేసిన మిగతా స్టార్ హీరోయిన్లను రిపీట్ చేస్తున్న చైతూ ‘దడ’ కథానాయిక కాజల్‌తో మాత్రం మళ్లీ జట్టు కట్టలేదు. ఆ సెంటిమెంట్ కు బ్రేక్ వేసాడు ప్రొడ్యూసర్ దిల్ రాజు.

అవును కాజల్ అండ్ చైతు మరోసారి కలిసి నటించనున్నారు అని టాక్. వీరిని కలిపే బాధ్యత దిల్ రాజు తీసుకున్నాడట. చైతుతో, రాజు ఓ సినిమా నిర్మించబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఒక కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తాడట. ఇది యాక్షన్ టచ్ ఉన్న లవ్ స్టోరీ అని సమాచారం. ఇందులో చైతు సరసన కాజల్ ఫైనల్ అయిందట. కాజల్ ప్రస్తుతం చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎవరితో పడితే వారితో సినిమాలు చేస్తూ వెళ్తుంది. రీసెంట్ గా ఆమె బెల్లంకొండ శ్రీనివాస్‌ తో మరో సినిమా చేసింది. ఇక త్వరలోనే కాజల్ - చైతు సినిమా గురించి డీటెయిల్స్ తెలియనున్నాయి.

Again Chaitu and Kajal Combo Movie Soon :

Movie in Dhada Combination


LATEST NEWS