అల్లు అరవింద్ ప్లాన్ చేస్తే అంతే మరి!

సాధారణంగా స్టార్స్‌కిడ్స్‌ తెరంగేట్రం చిత్రాలతో పాటు వారు నటించే ఇతర చిత్రాలను కూడా భారీ బడ్జెట్‌తో నిర్మించాలనే ఒత్తిడి ఉంటుంది. కానీ ఈ విషయంలో అల్లుఅరవింద్‌ ఎంతో ముందు చూపు ఉన్న వ్యక్తి. ఆయా హీరోలకు ఉన్న మార్కెట్‌, ముందు చిత్రాలకు ఆయా హీరోల చిత్రాలకు వచ్చిన కలెక్షన్లు వంటివి బాగా స్టడీ చేసి సినిమాలు తీస్తారు. ఇక నాగచైతన్య కెరీర్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘100%లవ్‌’ చిత్రం తీసిన అల్లుఅరవింద్‌ మంచి లాభాలనే సాధించాడు. ఇక విషయానికి వస్తే అక్కినేని వారి చిన్నబ్బాయ్‌ అఖిల్‌ నటించిన మూడు చిత్రాలకు కలెక్షన్లు బాగానే వచ్చినా బడ్జెట్‌ ఎక్కువైన కారణంగా అవి కాస్ట్‌ ఫెయిల్యూర్స్‌గా నిలిచాయి. అవే చిత్రాలను మీడియం బడ్జెట్‌తో నిర్మించి ఉంటే మూడింటిలో ‘హలో’ చిత్రం కమర్షియల్‌గా విజయం సాధించి ఉండేది. 

దీంతో అఖిల్‌ సినిమాల ఫెయిల్యూర్స్‌ కారణాలను క్షుణ్ణంగా పరిశీలించిన అల్లుఅరవింద్‌ త్వరలో బొమ్మరిల్లు భాస్కర్‌తో అఖిల్‌ చిత్రం కోసం కేవలం 20కోట్లు మాత్రమే కేటాయించాడట. ఇది వరుణ్‌తేజ్‌, నాని, విజయ్‌దేవరకొండ వంటి హీరోలకు తగ్గ బడ్జెట్‌. కానీ అంత తక్కువ బడ్జెట్‌తో చిత్రం చేస్తే సినిమాలో గ్రాండ్‌ రిచ్‌నెస్‌ తగ్గుతుంది కాబట్టి బడ్జెట్‌ని పెంచమని, కావాలంటే అదనపు బడ్జెట్‌ని తాను పెడతానని నాగార్జున చెప్పాడని వార్తలు వచ్చాయి. కానీ ఇందులో నిజం లేదని గీతాఆర్ట్స్‌ వర్గాలు ఖండిస్తున్నాయి. కథను బట్టే బడ్జెట్‌ని కేటాయిస్తామని గీతాఆర్ట్స్‌ అంటోంది. ఇక ఈ చిత్రానికి దర్శకుడైన బొమ్మరిల్లు భాస్కర్‌కి ఒకే ఒక్క విజయం తప్పించి మరో హిట్‌ లేదు. కేవలం ‘పరుగు’ మాత్రమే ఫర్వాలేదనిపించింది. అందునా ఆయన సరైనా ముందు చూపు లేకుండా ‘ఆరెంజ్‌’ చిత్రం చేశాడని, అనుకున్న సమయానికి పూర్తిచేయకుండా విపరీతంగా ఖర్చు పెంచాడని ఇప్పటికీ నాగబాబు అంటూ ఉంటాడు. 

జయాపజయాలు మన చేతుల్లో లేవు. ఆ విషయంలో బొమ్మరిల్లు భాస్కర్‌ని తప్పుపట్టను. కానీ ఆయన బడ్జెట్‌ పెంచడం, షూటింగ్‌ ఆలస్యం చేయడం దారుణమని వ్యాఖ్యానించాడు. ఇప్పుడు బొమ్మరిల్లు భాస్కర్‌కి ఏ హీరో, నిర్మాత చాన్స్‌ ఇవ్వడానికి రెడీగా లేరు. కానీ అల్లుఅరవింద్‌ మాత్రం చాన్స్‌ ఇచ్చాడు. అనుకున్న సమయానికి, అనుకున్న బడ్జెట్‌తో పూర్తిచేయించడంలో ఆయన దిట్ట. ఒకేసారి ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న బొమ్మరిల్లు భాస్కర్‌, శ్రీకాంత్‌ అడ్డాలకు అల్లు చాన్స్‌ ఇవ్వడం చూస్తుంటే ఆయన గట్స్‌ వెనుక ఎంతో ప్లానింగ్‌ ఉందనే అర్ధమవుతోంది. 

Allu Aravind Movies With Flop Directors:

Young Heroes, Flop Directors.. This is The Mega Producer Sketch


LATEST NEWS