‘పండుగాడి ఫోటో స్టూడియో’ రెడీ అవుతోంది

ఆలీ హీరోగా పెదరావురు ఫిలిం సిటీ పతాకంపై గుదిబండి వెంకట సాంబిరెడ్డి నిర్మించిన జంధ్యాల మార్క్ కామెడీ సినిమా ‘పండుగాడి ఫోటో స్టూడియో’. ప్రస్తుతం ఈ చిత్రం  షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ స్టార్ డైరెక్టర్ సుకుమార్ గారు ఒకే చేసిన కధ ఇది. ‘‘వీడు ఫోటో తీస్తే పెళ్లయి పోద్ది’’ అనేది  ఈ చిత్ర క్యాప్షన్. ఈ చిత్రంలో హీరోకు 40 ఇయర్స్ వచ్చేవరకు పెళ్లికాదనే నాగదేవత శాపం ఉంటుంది. ఆ క్రమంలో హరోయిన్ కంచు కనకరత్నం పరిచయం జరగడం, ఆమెతో ప్రేమలో పడటం మరోపక్క శాపం వల్ల జరిగే పరిణామాలే ఈ చిత్ర కదాంశం. పూర్తి హాస్య భరిత చిత్రమిది.

1150 చిత్రాల్లో  నటించిన ఆలీ గారు ఈ చిత్రంలో హీరోగా అద్భుతమైన నటనని ప్రదర్శించారు. హీరోయిన్ గా రిషితను పరిచయం చేస్తున్నాము. కుటుంబ సభ్యులతో కడుపుబ్బా నవ్వుకునేలా పండుగ ఫోటో స్టూడియో సినిమా రూపొందించామన్నారు. ఈ సినిమాలో వినోద్ కుమార్, బాబు మోహన్, సుధ, జీవ, శ్రీలక్ష్మి రామ్ జగన్ లాంటి సీనియర్ నటులతో పాటు విలక్షణమైన పాత్రల్లో సందీప్ రాజా,  టీనా చౌదరి తొలి పరిచయం చేస్తున్నాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జూన్ నెలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం. అని అన్నారు.       

ఈ చిత్రానికి నిర్మాత: గుదిబండి వెంకట సాంబిరెడ్డి,  సంగీతం: యాజమాన్య, ఎడిటర్: నందమూరి హరి, కెమెరా: మురళీమోహన్ రెడ్డి, ఫైట్స్: షావాలిన్ మల్లేష్,  డాన్స్: రఘు మాష్టర్, అజేయ శివశంకర్, అమ్మ  సుదీర్, దర్శకత్వం: దిలీప్ రాజా

Pandugadi Photo Studio Shooting Update:

Pandugadi Photo Studio Shooting completed


LATEST NEWS