Advertisement

ది పవర్ ఆఫ్ యూత్.. ‘జై సేన’


సింహరాశి, శివరామరాజు, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, ఎవడైతే నాకేంటి, అధినేత, పంచాక్షరి, సేవకుడు వంటి హిట్ చిత్రాలు అందించిన వి.సముద్ర దర్శకత్వంలో శ్రీకాంత్, సునీల్, శ్రీ ప్రముఖ పాత్రల్లో ప్రవీణ్, కార్తికేయ, హరీష్, అభిరామ్ లను పరిచయం చేస్తూ శివమహాతేజ ఫిలిమ్స్ బ్యానర్ పై సాయి అరుణ్ కుమార్ నిర్మాతగా నిర్మిస్తున్న చిత్రం ‘జై సేన...ది పవర్ ఆఫ్ యూత్’. ఇద్దరు ప్రముఖ హీరోలు అతిధి పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రంలో ఇతర పాత్రల్లో ఆరాధ్య, నీతూ, చిత్ర, ప్రీతి శర్మ, పృథ్వి, ధన్ రాజ్, అజయ్ ఘోష్, మధు, నల్ల వేణు, చమ్మక్ చంద్ర, ఆజాద్, రాజేంద్ర నటిస్తున్నారు.

Advertisement

దర్శకుడు  వి.సముద్ర మాట్లాడుతూ.. ‘‘దేశానికి వెన్నెముకైన రైతుని కాపాడండి అని స్టూడెంట్స్ ప్రభుత్వంతో, రాజకీయ నాయకులతో చేసే యుద్ధమే ఈ సినిమా కథాంశం. హైదరాబాద్, మడికరి, ఒంగోలు, వైజాగ్, బళ్ళారి, బెంగళూరు, చిక్ మంగళూరు‌లో 70 రోజుల పాటు ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంది. శ్రీకాంత్, సునీల్  కీలక పాత్రల్లో కనిపిస్తారు. అలాగే నలుగురు కొత్త హీరోలు పరిచయం అవుతున్నారు. ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను త్వరలోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. ఒక పవర్ ఫుల్ మెసేజ్‌తో కూడుకున్న ఎమోషనల్ యూత్ ఫుల్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం నాకు మరో హిట్ సినిమా అవుతుంది’’ అన్నారు.                                

మాటలు - టి.కిరణ్, పార్వతి చందు 

ఫైట్స్ - కనల్ కన్నన్, నందు, రవి వర్మ    

ఛాయాగ్రహణం - వాసు 

సంగీతం - ఎస్ ఆర్ రవిశంకర్ 

సహా నిర్మాతలు - శిరీష్ రెడ్డి శ్రీనివాస్  

నిర్మాత - సాయి అరుణ్ కుమార్

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం - వి.సముద్ర

V Samudra Next Film Details:

Jai Sena is the V Samudra Next Film Title
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement