Advertisement

ఏదైనా సాధిస్తేనే సెలబ్రేషన్: వర్మ


సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొత్త అవతారమెత్తాడు. మొట్టమొదటిసారిగా ‘‘కోబ్రా’’ అనే తన సినిమాలో ఓ ముఖ్యపాత్రలో నటించబోతున్నాడు. ‘‘ఆర్జీవి గన్ షాట్ ప్రొడక్షన్స్’’ బ్యానర్‌పై డి.పి.ఆర్ నిర్మిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆదివారం వర్మ.. బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేశారు. ఓ మోస్ట్ డేంజరస్ క్రిమినల్ బయోపిక్‌గా తెరకెక్కుతున్న ‘‘కోబ్రా’’ మూవీ హిందీ, తెలుగు భాషల్లో రూపొందుతోంది. రీసెంట్‌గా విజయం సాధించిన ‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్’’ లాగానే ఈ సినిమాను కూడా రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజు‌లు కలిసి డైరెక్ట్ చేస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించడం విశేషం. ఇంటెలిజన్స్ ఆఫీసర్ పాత్రలో రామ్ గోపాల్ వర్మ నటిస్తుండగా, క్రిమినల్ పాత్రలో కె.జి అనే కొత్త యాక్టర్ నటిస్తున్నారు. ముఖ్యమంత్రి కె.సి.ఆర్ పాత్రను రంగారావు అనే నటుడు పోషిస్తున్నారు.

Advertisement

ఫస్ట్ లుక్ లాంచ్ వేడుక‌లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. ‘‘బర్త్‌డే అంటే నాకు చాలా చిరాకు. ఒక సంవత్సరం చావుకు దగ్గరవుతున్నామనిపిస్తుంటుంది నాకు. మనం పుట్టిన తర్వాత ఏదో ఒకటి సాధిస్తే.. అది సెలబ్రేట్ చేసుకుంటే ఎక్కువ అర్థం ఉంటుందనేది నా అభిప్రాయం. ఇంత చెబుతున్న నేను.. ఈ సంవత్సరం ఎందుకు చేసుకుంటున్నానంటే ఈ రోజు నేను నటుడిగా పుట్టాను. కోబ్రా మూవీ స్క్రిప్ట్ రాస్తుంటే.. కొత్త రకమైన ఇంటెలిజన్స్ ఆఫీసర్ పాత్రలో నేనే నటిస్తే బాగుంటుందని అనిపించింది. మరో ప్రత్యేకత ఏంటంటే.. ఈ మూవీతో ‘‘ఆర్జీవి గన్ షాట్ ప్రొడక్షన్స్’’ నిర్మాణంలోకి అడుగుపెడుతుంది. ఇక ఈ సినిమాకు ఇంకో స్పెషాలిటీ ఏంటంటే. నా కెరీర్ లో ‘‘క్షణక్షణం’’ మ్యూజిక్ పరంగా ఓ మైలురాయి.  29 ఏళ్ల తర్వాత మళ్లీ నేను, కీరవాణి గారు కలిసి ‘‘కోబ్రా’’ సినిమా కోసం కలుస్తున్నాం. చాలా హ్యపీ‌గా ఉంది..’’ అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి మాట్లాడుతూ.. ‘‘రామ్ గోపాల్ వర్మ గారు మంచి మ్యూజిక్ లవర్. ఆయన ఫస్ట్ టైమ్ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవటం మనం ఊహించనిది. ఇలాంటి మార్పులు ఈ ‘‘కోబ్రా’’లో మనం ఇంకా చూడొచ్చు. నాలో కొత్త కోణాన్ని ఈ చిత్రం ద్వారా రాము గారు బయటకు తీస్తారనుకుంటున్నాను. నటుడిగా కూడా ఆయనకు ఇది చాలెంజింగ్ సినిమా. ఎందుకంటే మనం నిజ జీవితంలో నటిస్తూ ఉంటాం. కానీ ఆయన నటించరు. ఇప్పుడు నటించాల్సి ఉంటుంది. 29 ఏళ్ల ‘‘క్షణక్షణం’’ తర్వాత మళ్లీ రాముగారితో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశమిచ్చినందుకు ఆయనకు చాలా థాంక్స్..’’ అన్నారు.

ఆర్జీవి గన్ షాట్ ప్రొడక్షన్స్ నిర్మాత ‘‘డి.పి.ఆర్’’ మాట్లాడుతూ.. ‘‘ఆర్జీవి గన్ షాట్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఈ ‘‘కోబ్రా’’ చిత్రాన్ని నిర్మించేందుకు అవకాశం ఇచ్చినందుకు వర్మగారికి ధన్యవాదాలు. సంవత్సరంలో 8 నుంచి 10 సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు మా బ్యానర్ మీద వర్మగారితో తీస్తాం. ఆ ఐడియా ఇచ్చింది ఆయనే. దానికి ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాం’’ అన్నారు.

Cobra Movie First look Launched:

Ram Gopal Varma Gives Shock With Cobra
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement