Advertisement

మజిలీ.. హాట్ కేక్..!!


నాగ చైతన్య - సమంత - దివ్యాంక కౌశిక్ జంటగా శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కిన మజిలీ సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గత రెండు నెలలుగా బాక్సాఫీసు వద్ద సందడి కనిపించడం లేదు. జనవరిలో ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మళ్ళీ కళ్యాణ్ రామ్ 118 కాస్త ఊరటనిచ్చింది.. 118 ని అంతగా ప్రేక్షకులు ఆదరించిన పాపానపోలేదు. మరి మంచి సినిమా కోసం మొహం వాచిపోయి ఉన్న ప్రేక్షకులకు ఇప్పుడు మజిలీ సినిమా ఊరటనిచ్చేలా కనబడుతుంది. కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన మజిలీ మీద ప్రేక్షకుల్లోనే కాదు.. ట్రేడ్ లోను మంచి ఆసక్తి ఉంది.

Advertisement

మజిలీ ట్రైలర్ తోనే సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. క్రికెట్, లవ్, భార్య భర్తల అనుబంధం, కుటుంబ విలువలతో తెరకెక్కిన మజిలీ సినిమా మీద ప్రేక్షకులు ఎంతగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే... బుక్ మై షోలో మజిలీ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. మల్టీప్లెక్స్ థియేటర్స్ అన్ని టికెట్స్ తెగడంతో కళకళలాడుతున్నాయి. సమంత క్రేజ్, చైతు యాక్షన్, శివ దర్శకత్వం అన్ని కలగలిపి మజిలీ మీద... మజిలీ టీం మాత్రమే కాదు ప్రేక్షకులు కూడా భారీ ఆశలే పెట్టుకున్నారు. మరి చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూడబోతున్నామనే ఆశని మజిలీ చిత్రం ఎంతవరకు తీరుస్తుందో మరికొద్ది గంటల్లోనే తేలిపోతుంది.

Superb Craze to Majili Movie:

Majili Movie Ready to Release
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement