Advertisement

బాలయ్యపై అటాక్ కోసం చూస్తున్నారు


తండ్రి బయోపిక్‌తో నిర్మాతగా బాలకృష్ణ కోట్లు వెనకేసుకుందామనుకుంటే... మొదటికే మోసం వచ్చింది. ఎన్టీఆర్ బయోపిక్‌తో బాలకృష్ణ నిండా మునిగాడు..  కాదు కాదు బయ్యర్లను నిండా ముంచాడు. కథానాయకుడు సినిమాకి, మహానాయకుడు సినిమాకి 50 కోట్ల బడ్జెట్ అయితే.. కథానాయకుడు సినిమాని 70 కోట్లకి బయ్యర్లకి అమ్మేశాడు. కానీ కథానాయకుడు దెబ్బకి బయ్యర్లు బెంబేలెత్తారు. కథానాయకుడితో బయ్యర్లు అక్షరాలా 50 కోట్ల నష్టాన్ని చవిచూశారు. ఇక బయ్యర్లు బాలయ్యని నిలదీసి అడగకుండా మహానాయకుడు హక్కులు ఇస్తే చాలన్నట్టుగా ఊరుకున్నారు. అయితే బాలయ్య మాత్రం కథానాయకుడికి వచ్చిన నష్టంలో మూడోవంతు భరిస్తామని మాట మాత్రం ఇచ్చి.... రెండవ చిత్రం మహానాయకుడ్ని పర్సంటేజ్‌ పద్ధతి మీద విడుదల చేసాడు.

Advertisement

మరి కథానాయకుడు లాస్ 50 కోట్లు ఉంటే.. మహానాయకుడు ఫుల్ రన్ లో కేవలం ఐదు కోట్లతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మహానాయకుడు సినిమాకి కనీసం థియేటర్స్ రెంట్ కానీ, కరెంట్ బిల్లులు కానీ వచ్చే పరిస్థితులు లేక...ఆఖరుకి టిడిపి కార్యకర్తలంతా కలిసి మహానాయకుడు షోస్ ని ఫ్రీగా వేయిస్తున్నారు. ఎన్టీఆర్ పై సినిమా చేసి ఆయన గౌరవాన్ని దిగజార్చే పని చేసిన బాలకృష్ణ ఒకపక్క పరువు మరోపక్క ఆర్థికంగానూ బాగా లాస్ అయ్యాడు. మరి కథానాయకుడు విషయంలో కాస్త వెనక్కి తగ్గినా బయ్యర్లు మహానాయకుడు దెబ్బకి బాలయ్యని ఏం చేస్తారో అంటున్నారు.

కథానాయకుడు నష్టాల్లో మూడో వంతు ఇస్తామని మాట అయితే ఇచ్చారు కానీ ఇంకా వెనక్కి ఏమీ ఇవ్వలేదంటున్నారు. మరి ఇప్పుడు మహానాయకుడు కూడా కోలుకోలేని దెబ్బేసింది. మరి బాలయ్య ఇప్పుడు బయ్యర్లను ఎలా డీల్ చేస్తాడో అంటూ ఫిలింనగర్ లో గుసగుసలు వినబడుతున్నాయి. కథానాయకుడు లాస్ వచ్చినపుడు  బాలయ్యకి జడిసి బయ్యర్లు నోరెత్తలేదనే టాక్ అయితే నడిచింది. మరి ఇప్పుడు కథానాయకుడు, మహానాయకుడు లాస్ తో బయ్యర్లు బాలయ్యకి భయపడితే.. వాళ్లకు పీకల్లోతు నష్టాలూ తప్పవు. అందుకే బయ్యర్లంతా కలిసి బాలయ్యను వదలరు.. అంటున్నారు యాంటి ఫ్యాన్స్.

Heavy loss to NTR Biopic Buyers:

Buyers plans to Attack on Balakrishna
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement