Advertisement

‘మహానాయకుడు’ పరిస్థితి దారుణంగా ఉందట!


హమ్మయ్య ఎన్నో ఇబ్బందులు మధ్య ఎన్టీఆర్ ‘మహానాయకుడు’ సినిమా నిన్న రిలీజ్ అయింది. కథానాయకుడుతో పోలిస్తే ఈ సినిమా మరీ డిజాస్టర్ గా మిలిగిపోయింది. కలెక్షన్స్ కూడా చాలా డల్ గా వచ్చాయి. ఓపెనింగ్స్ కూడా అదే విధంగా వచ్చాయి. సంక్రాంతి సీజన్ లో మంచి హైప్ తో రిలీజ్ అయిన కథానాయకుడు అనుకున్న స్థాయిలో లేకపోవడంతో జనాదరణకు నోచుకోలేదు. ఇక అన్ సీజన్లో.. ఎంతో నెగెటివిటీ మధ్య రిలీజై.. ఓ మోస్తరు టాక్ తెచ్చుకున్న ‘మహానాయకుడు’ పరిస్థితి చెప్పేదేముంది? 

Advertisement

కథానాయకుడు మొదటి రోజు మంచి వసూల్ రాబట్టింది. మెజారిటీ స్క్రీన్లలో హౌస్ ఫుల్స్ పడ్డాయి. కానీ మహానాయకుడు ఫస్ట్ డే.. మేజర్ సిటీస్‌లోని ప్రధాన థియేటర్లలో కూడా హౌస్ ఫుల్స్ లేవు. కారణం సినిమాలో అసలు కంటెంట్ లేకపోవడం, ప్రమోషన్స్ కూడా అసలు లేకపోవడం. హైదరాబాద్ లో ఈ సినిమాకు ఒక ట్రెండు మల్టీప్లెక్సుల్ని మినహాయిస్తే అన్ని చోట్లా ఆక్యుపెన్సీ సరిగా లేదు. ఉదయం షోస్ తరువాత పరిస్థితి ఇబ్బందికరంగా తయారైంది.

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో  కథానాయకుడు తొలిరోజు మూడు థియేటర్స్ లో రిలీజ్ చేస్తే... మహానాయకుడు ఒక స్క్రీన్లోనే వేశారు. కథానాయకుడుతో పోలిస్తే తొలిరోజు షేర్ సగం రావడం వింత. సో కథానాయకుడు కొని నష్ట పోయిన డిస్ట్రిబ్యూటర్స్ కి ఈసినిమా ఏమన్నా ఊరట ఇస్తుంది అనుకుంటే కష్టంలా కనిపిస్తుంది.

No Collections to NTR Mahanayakudu Movie:

NTR Mahanayakudu Situation at RTC X Roads 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement