Advertisement

ప్రభాస్‌తో సినిమా అంటే ఇక అంతేనా?


యంగ్‌రెబెల్‌స్టార్‌గా, రెబెల్‌స్టార్‌ కృష్ణంరాజు వారసునిగా పరిచయం అయిన ప్రభాస్‌ కెరీర్‌ని ‘బాహుబలి’కి ముందు ‘బాహుబలి’ తర్వాత అని చెప్పుకోవాలి. దానికి ముందు కూడా ఆయనకు హిట్స్‌ ఉన్నప్పటికీ కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే పరిచయం ఉన్న ప్రభాస్‌ ‘బాహుబలి’తో నేషనల్‌ ఐకాన్‌గా, దేశవిదేశాలలో కూడా గుర్తింపును తెచ్చుకున్నాడు. ప్రస్తుతం రాజమౌళి చిత్రం అంటే దేశవ్యాప్తంగా అందరు ఎలా ఎదురుచూస్తున్నారో తెలిసిందే. మరీ రాజమౌళి స్థాయిలో కాకపోయినా ప్రభాస్‌ తదుపరి చిత్రాలపై కూడా అన్ని వుడ్‌లలో ఎంతో ఆసక్తిని చూపుతున్నారు. 

Advertisement

అయితే ప్రభాస్‌ తెగింపు ఏమిటో గానీ ఆయన ‘బాహుబలి’ వంటి కనీవినీ ఎరుగని విజయం తర్వాత కేవలం ఒకే సినిమా అనుభవం ఉన్న సుజీత్‌తో ‘సాహో’, ‘జిల్‌’ రాధాకృష్ణతో తన 20వ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాల షూటింగ్స్‌ ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ రెండింటి బడ్జెట్‌ కూడా 200కోట్లు అని, ఇవి కూడా అన్ని వుడ్‌లలో విడుదల కానున్నాయని వార్తలు వస్తున్నాయి. మరి నేడు ప్రభాస్‌తో చిత్రం చేయాలంటే కనీసం 200కోట్ల బడ్జెట్‌ కేటాయించాల్సిన పరిస్థితి వచ్చిందనే చెప్పాలి. కానీ ప్రతి చిత్రానికి ఇంత బడ్జెట్‌ కేటాయిస్తూ పోతే ఎక్కడో అక్కడ చైన్‌ తెగిపోయి భారీ నష్టాలు రావడం ఖాయం. అందునా పెద్దగా అనుభవం లేని వారితో ఇలా తీయడం జూదమే అవుతుందనే అనుమానాలు కూడా ఉన్నాయి. 

ఇక ‘సాహో’ చిత్రం స్వాతంత్య్రదినోత్సవ కానుకగా ఆగష్టు15న విడుదలయ్యే అవకాశం ఉంది. అలాగే యూవి క్రియేషన్స్‌తో పాటు తన పెదనాన్న కృష్ణంరాజు భాగస్వామిగా కూడా ఉన్న జిల్‌ రాధాకృష్ణ చిత్రం కూడా ఇదే ఏడాది చివరలో క్రిస్మస్‌ కానుకగా విడుదలవుతుందనే ప్రచారం జరుగుతోంది. మరి ఇది సాథ్యమయ్యేనా లేదా అనేది వేచిచూడాల్సివుంది. ఎందుకంటే ‘సాహో’ చిత్రం హాలీవుడ్‌ రేంజ్‌ యాక్షన్‌ మూవీగా రూపొందుతుండగా, జిల్‌ రాధాకృష్ణ చిత్రం ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్‌ లవ్‌స్టోరీగా రూపొందుతోందని సమాచారం. 

ఇక తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న పూజాహెగ్డే ఈ చిత్రం గురించి మాట్లాడుతూ, ఇది ఒక అమేజింగ్‌ స్క్రిప్ట్‌. ఇప్పటివరకు నేను నటించిన చిత్రాలలో చాలెంజింగ్‌ పాత్ర ఇదే. ఈ సినిమా కథ విన్నప్పుడు మతి పోయింది. అలాంటి పాత్రలో నటించడం చాలా కష్టం. ఇదో అందమైన సినిమా. యూనిక్‌గా ఉంటుందని ప్రామిస్‌ చేస్తున్నానని తెలపడంతో దీనిపై అంచనాలు పెరిగాయి. బహుశా ప్రభాస్‌ ఈ రెండు చిత్రాలను కేవలం దర్శకుల అనుభవం కాకుండా వారి టాలెంట్‌, కథలోని సత్తాని చూసి మాత్రమే ఒప్పుకున్నాడనే విషయం అర్ధమవుతోంది. అయినా ఏమాటకామాటే చెప్పాలంటే ‘బాహుబలి’ అనేది ఓ ప్రత్యేకమైన చిత్రం. మరి ఈ రెండు చిత్రాలు విడుదలైతే గానీ ప్రభాస్‌ నిజమైన స్టామినా ఏమిటి? అనేది నిరూపితం అవ్వదనే చెప్పాలి. 

Pooja Hegde Praises Sahoo:

Sahoo Picturised With Great Story
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement