Advertisement

‘కథానాయకుడు‌’ ఆల్ టైం డిజాస్టర్స్‌లో..


సంక్రాంతి సీజన్ అయిపోయింది. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. థియేటర్స్ లో ఉన్న సినిమాల హడావుడి కూడా కొంచెం కొంచెం తగ్గుతూ వస్తున్నాయి. ఎన్నో అంచనాలు మధ్య రిలీజ్ అయిన ఎన్టీఆర్ కథానాయకుడు బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా చతికిలబడింది. పండగ సెలవుల్లో కొంచెం పర్లేదు అనుకున్న ఆ తరువాత పూర్తిగా డల్ అయిపోయింది.

Advertisement

ఈ సినిమాను బయర్స్ 70 కోట్లుకు కొంటే అందులో మూడో వంతు కూడా వెనక్కి వచ్చే సూచనలు కనిపించడం లేదు. ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.20 కోట్ల షేర్ మార్కు దగ్గర ఆగిపోయే పరిస్థితి కనిపిస్తోంది. అంటే దాదాపు 50 కోట్లు నష్టం వచ్చేలా కనిపిస్తుంది. తొలిరోజు పర్లేదు అనిపించుకున్న రెండో రోజు నుండి రిజల్ట్ బెడిసికొట్టింది.

ఇక ఈ వీకెండ్ తరువాత ఈ సినిమాను ఎక్కువ థియేటర్స్ నుండి తీసేసే అవకాశముంది. ఇప్పటి వరకు టాలీవుడ్ లో అత్యధిక నష్టాలు తెచ్చి పెట్టిన సినిమా అంటే ‘అజ్ఞాతవాసి’నే. రూ.60 కోట్ల దాకా బయ్యర్లను ముంచింది. ‘స్పైడర్’ సినిమా కూడా దానికి చేరువగా వెళ్లి 55 కోట్ల దాకా నష్టాలు తెచ్చిపెట్టింది. ఆ తరువాత స్థానంలో ఎన్టీఆర్ కథానాయకుడు 50 కోట్ల నష్టాలతో ఆల్ టైం డిజాస్టర్లలో మూడో స్థానానికి స్థిరపడటం ఖాయంగా కనిపిస్తోంది.

Kathanayakudu in All Time Disaster List:

NTR Kathanayakudu Movie Flop at Box Office
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement