Advertisement

‘పేట’కు టాలీవుడ్ అంత చులకనైంది మరి?


తమిళ సినిమాలకు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంటుంది. రజినీకాంత్, విజయ్, అజిత్, సూర్య, విశాల్, కార్తీ ఇలా ఏ హీరో సినిమా అయినా తెలుగులో ఆ సినిమాని కొనుక్కుని డబ్ చేస్తుంటారు. కొన్ని సినిమాలు లాభాలు తెస్తాయి. మరికొన్ని అక్కడక్కడికి సరిపోతాయి. తాజాగా 2.ఓ సినిమాని తెలుగు వాళ్ళు భారీగా కొనుగోలు చేశారు. అయితే తెలుగులో ప్రతి సినిమాని డబ్ చేసే తమిళ హీరోలు ఇక్కడ తమ సినిమాల ప్రమోషన్స్ విషయంలో చాలా లైట్ తీసుకుంటున్నారు. 2.ఓ సినిమాని భారీగా కొన్నప్పటికీ. 2.ఓ టీం ఒకసారి హైదరాబాద్ రావడం ఇక్కడ ఓ ఈవెంట్ ని చేసేసి చేతులు దులిపేసుకుంది. ఇక గత వారం విడుదలైన మారి 2 సరైన ప్రమోషన్ లేక ఆ సినిమా ఎప్పుడు విడుదలైంది వెళ్ళింది కూడా తెలుగు ప్రేక్షకులకు తెలియని పరిస్థితి.

Advertisement

ప్రస్తుతం రజినీకాంత్ పేట పరిస్థితి అలానే ఉంది. పేట సినిమా తెలుగు తమిళంలో ఒకేరోజు అంటే జనవరి 10 నే విడుదలవుతుంది. ఆ సినిమా మొన్న మొన్నటివరకు తెలుగు పోస్టర్ కూడా విడుదల చెయ్యలేదు. ఇక కాలా, కబాలి సినిమాల దెబ్బకి పేట సినిమాని కొనడానికి నిన్నమొన్నటివరకు నిర్మాతలెవరు సాహసం చెయ్యలేదు. కాలా, కబాలి, 2.ఓ సినిమాల టాక్ తో రజిని మార్కెట్ తెలుగులో అనూహ్యంగా పడిపోయింది. తమిళంతో పోటీపడి తెలుగులో అభిమానులను సంపాదించుకున్న రజిని కి ప్రస్తుతం తెలుగులో ఓ అన్నంత మార్కెట్ లేదు. అయితే పేట సినిమాని పర్వాలేదనిపించే రేటుకే కొన్నారు.

మరి తమిళనాట భారీ అంచనాలున్న పేట సినిమాపై తెలుగులోనూ ప్రేక్షకులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అయితే తమిళంలో చేసిన ప్రమోషన్స్ పేట విషయంలో తెలుగులో కనబడటం లేదు. తమిళనాట పేట ఆడియో వేడుకని గ్రాండ్ గా చేసిన నిర్మాతలు తెలుగులో సరైన ప్రమోషన్స్ చెయ్యడం లేదు. అసలు తెలుగు ప్రేక్షకులంటే తమిళ తంబీలకు అంత చిన్న చూపా? అనే ఫీలింగ్ కలగకమానదు. విడుదలకు పట్టుమని వారం రోజులు కూడా లేదు... ఈ సినిమాకి కనీస ప్రమోషన్స్ లేకపోతే ఇక్కడ తెలుగు సినిమాలు అంటే... సంక్రాంతికి విడుదల కాబోయే ఎన్టీఆర్ బయోపిక్, వినయ విధేయ రామ, ఎఫ్ టు సినిమాల్లో పడి కొట్టుకుపోవడం ఖాయంగానే కనబడుతుంది.

No Peta Promotions in Tollywood:

Peta Producers Insults Tollywood
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement