Advertisement

దిల్ రాజు ధైర్యానికి హ్యాట్సాఫ్.. కానీ...?


గత ఏడాది యంగ్ హీరోలతో సినిమాలు చేసి చేతులు కాల్చుకున్న దిల్ రాజు... తాజాగా ఎఫ్ టు.. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ సినిమాతో ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సంక్రాంతి తనకు అచ్చొచ్చిన పండగగా దిల్ రాజు బలంగా నమ్ముతాడు. అందుకే పెద్ద సినిమాల మీదకి తన సినిమాని ఏ మాత్రం భయపడకుండా దింపుతాడు. అయితే సంక్రాంతి సెంటిమెంట్ ఇప్పటివరకు దిల్ రాజుకు బాగానే కలిసొచ్చింది. కానీ ఈసారి మాత్రం ఆ నమ్మకం, సెంటిమెంట్ కలిసొచ్చేలా కనబడ్డం లేదు. ఎందుకంటే జనవరి తొమ్మిదిన ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు గ్రాండ్‌గా భారీ అంచనాలతో విడుదలవుతుంది. అలాగే జనవరి 10న తమిళం నుండి రజినీకాంత్ జెట్ స్పీడుతో ‘పేట’తో రెడీగా ఉన్నాడు. ఇక జనవరి 11 న రామ్ చరణ్ మాస్ చిత్రం ‘వినయ విధేయ రామ’తో బరిలోకి బలంగా దిగుతున్నాడు.

Advertisement

ఇక ఈ మూడు చిత్రాల టాక్ బావున్నాయంటే.. F2 నిలబడటం కష్టమే. ఒకవేళ ఎఫ్ టుకు కూడా టాక్ బావుంటే... పండగ సీజన్ కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ తో ఆడేస్తుంది. అదే సో సో టాక్ వచ్చిందా.. దిల్ రాజు పని అవుట్. దర్శకుడు అనిల్ రావిపూడి తీసిన మీడియం బడ్జెట్ చిత్రాలు ఇప్పటివరకు హిట్ అయితే అయ్యాయి కానీ... సూపర్ అండ్ బ్లాక్ బస్టర్ హిట్స్ పడిన సందర్భం లేదు. కాకపోతే అనిల్ రావిపూడి సినిమాల్లో కామెడీకి కొదవ ఉండదు. మరి ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు ఎన్టీఆర్ నటజీవితాన్ని చూపించే ప్రయత్నంలో ఎంత కామెడీ యాడ్ చేసారో తెలియదు. ఇక వినయ విధేయ రామ పక్కా మాస్ మూవీ గా మొదటినుండి హైలెట్ అవుతుంది. ఇక రజినీకాంత్ పేట సినిమా కూడా కాస్త మాస్ తోనూ, రజిని స్టయిల్ తోనూ కనబడుతుంది.

ఇక ఈ సంక్రాంతికి పక్కా కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ ఎఫ్ టు.. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ కనబడుతుంది.. కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ తొందరగా ఎట్రాక్ట్ అవుతారు. మరి కేవలం కామెడీతో సినిమాలు ఆడేస్తాయి.. పండగ సెంటిమెంట్ ఉంది అంటే సరిపోదు.. కావాల్సినంత కంటెంట్ కూడా అవసరం. మరి సినిమాకి యావరేజ్ టాకొచ్చినా దిల్ రాజు గట్టెక్కేస్తాడు. అలాగే ఆ మూడు పెద్ద సినిమాల మధ్య నలిగిపోకుండా ఉంటాడు. అదే గనక టాక్ తేడా కొడితే ఆ మూడు పెద్ద సినిమాల మధ్యలో పోక చెక్కలా నలగడం ఖాయం. 2017లో వరస హిట్స్ కొట్టిన దిల్ రాజుకి.. 2018 సంవత్సరం అస్సలు కలిసి రాలేదు. చేసిన ప్రతి సినిమా ప్లాప్ అయ్యి కూర్చోవడంతో... ఈ ఏడాది ఎఫ్ టు మీద మహేష్ మహర్షి మీద దిల్ రాజు భారీ ఆశలే పెట్టుకున్నాడు.

Hats off to Dil Raju Ghats.. But?:

F2 in Sankranthi Race..
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement