Advertisement

‘బాహుబలి’ మోజులో మరో భారీ మూవీ ఫ్లాప్!


ప్రతి సినీ ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు ఏదొక సినిమా ‘బాహుబలి’ రికార్డ్స్‌ను బ్రేక్ చేసేలా, ‘బాహుబలి’నే టార్గెట్‌గా పెట్టుకుని తెరకెక్కుతున్న విషయం గమనిస్తూనే ఉన్నారు ప్రేక్షకులు. ఎక్కువ బడ్జెట్‌తో తీసే సినిమాలు.. స్టార్ ఇమేజ్ ఉన్న సినిమాలు ‘బాహుబలి’తో పోల్చడం కామన్ అయిపోయింది. ఆ మధ్య తమిళం‌లో విజయ్ నటించిన ‘పులి’ని.. ‘బాహుబలి’తో పోల్చారు. కానీ అది డిజాస్టర్‌గా నిలిచింది. ఇక రీసెంట్‌గా హిందీలో ‘బాహుబలి’ రికార్డ్స్ అన్ని బ్రేక్ చేయడానికి ఓ సినిమా వచ్చింది. అమీర్ ఖాన్.. అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ హీరోస్ ఆ సినిమాలో ఉండటం విశేషం. ఆ సినిమా మరేదో కాదు ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’. ఈ సినిమా ఇండియాలో ఉన్న అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసి మొదటి స్థానంలో ఉంటుందని అంతా భావించారు. కానీ అమీర్ ఖాన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ అట్టర్‌ప్లాప్‌గా నిలిచింది. 

Advertisement

ఇప్పుడు తాజాగా మలయాళ మూవీ ‘ఒడియన్’కూ ఈ పోలిక వచ్చింది. ‘బాహుబలి’ వంటి సినిమా కాకపోవచ్చు కానీ రికార్డుల్ని బద్దలు కొట్టే చిత్రమిదని ప్రచారం చేశారు. మలయాళ సినీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఈ సినిమాకు రూ.100 కోట్ల బిజినెస్ జరగడం విశేషం. దాంతో మలయాళ ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమా కోసం చాలా వెయిట్ చేసింది. ఇక వసూళ్లు దానికి రెట్టింపు వస్తాయని అభిమానులు సవాళ్లు విసిరారు. కానీ అంత మాటలకే పరిమితం అయింది. ‘ఒడియన్’ సినిమా రిలీజ్ అయిన ప్రతి చోటా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.

ఈ సినిమా మీద ‘మన్యం పులి’ చిత్రం వెయ్యి రెట్లు బెటర్ అని అభిప్రాయపడుతున్నారు. కంటెంట్ పరంగా...30-40 ఏళ్ల కాలం రొమాన్స్.. విలనిజంతో జనాలని విసిగించేసారు. దాంతో తొలి రోజే ఈ మూవీని ప్రేక్షకులు తిరస్కరించారు. రికార్డు బ్రేకింగ్ మూవీ అవుతుందని ఆశ పడ్డ ‘ఒడియన్’ టీంకు ఇది పెద్ద షాకే. మలయాళంలో ఏమో కానీ తెలుగులో ఈసినిమా సేఫ్ జోన్ లోకి వెళ్లే అవకాశాలు చాలా తక్కువ.

One More Movie Flop.. in Babubali way:

Odiyan got Flop talk at Box Office
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement