Advertisement

‘చిత్రల‌హ‌రి’ సెట్‌పైకి ఎక్కేసింది..!


‘చిత్రల‌హ‌రి’ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం.. ఏప్రిల్‌లో విడుద‌ల‌

Advertisement

సుప్రీమ్ హీరో సాయిధ‌రమ్ తేజ్ హీరోగా నేను శైల‌జ ఫేమ్ కిషోర్ తిరుమ‌ల ద‌ర్శక‌త్వంలో ‘శ్రీమంతుడు’, ‘జ‌న‌తాగ్యారేజ్‌’, ‘రంగ‌స్థలం’ వంటి బ్లాక్ బ‌స్టర్ చిత్రాల‌ను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, చెరుకూరి మోహ‌న్ నిర్మిస్తోన్న చిత్రం ‘చిత్రల‌హ‌రి’. ఇటీవ‌ల లాంఛ‌నంగా ప్రారంభ‌మైన ఈ చిత్రం.. రెగ్యుల‌ర్ షూటింగ్ సోమ‌వారం హైద‌రాబాద్‌లో ప్రారంభమైంది. సాయిధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శన్‌, నివేదా పేతురాజ్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. అన్ని కార్యక్రమాల‌ను పూర్తి చేసి సినిమాను 2019 ఏప్రిల్‌లో విడుద‌ల చేయడానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు మాట్లాడుతూ.. ‘‘కిషోర్ తిరుమల సినిమా అంటే క్యూట్ ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటూనే ఎమోష‌న్స్ క్యారీ అవుతుంటాయి. అలాంటి మ‌రో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనింగ్ స‌బ్జెక్ట్‌తో చిత్రల‌హ‌రి తెర‌కెక్కుతోంది. రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. మా బ్యాన‌ర్‌లో ‘శ్రీమంతుడు’, ‘జ‌న‌తాగ్యారేజ్‌’, ‘రంగ‌స్థలం’ చిత్రాల‌కు బ్లాక్ బ‌స్టర్ సంగీతాన్ని అందించిన రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఆయ‌న సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంద‌న‌డంలో సందేహం లేదు. సాయిధ‌ర‌మ్ తేజ్‌ను స‌రికొత్త యాంగిల్‌లో కిషోర్ తిరుమ‌ల‌గారు ప్రెజంట్ చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను వ‌చ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుద‌ల చేయాల‌నుకుంటున్నాం’’ అన్నారు. 

సాయిధ‌ర‌మ్‌తేజ్‌, క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శన్, నివేదా పేతురాజ్‌ హీరో హీరోయిన్స్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌, సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘ‌ట్టమ‌నేని, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్రకాశ్‌, సి.ఇ.వో/ సి.ఒ.ఐ: పి.చిరంజీవి, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, లైన్ ప్రొడ్యూస‌ర్‌: కె.వి.వి.బాలసుబ్రమ‌ణ్యం, కో-ప్రొడ్యూసర్: ఎం.ప్రవీణ్, నిర్మాత‌లు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్ చెరుకూరి (సి.వి.ఎం), ద‌ర్శక‌త్వం: కిషోర్ తిరుమల.

Chitralahari movie Regular Shoot Starts:

Sai Dharam Tej New movie Shooting Starts
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement