Advertisement
Google Ads BL

రాజమౌళి ప్రశ్న- శంకర్ సమాధానం


సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం ‘2.0’. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘రోబో’ చిత్రానికి సీక్వెల్‌గా ‘2.0’ చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌, కరణ్‌ జోహర్‌ సమర్పణలో సుభాష్‌ కరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వేల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంతేకాకుండా పూర్తిగా త్రిడి ఫార్మాట్‌లో చిత్రీకరణ జరుపుకున్న తొలి భారతీయ సినిమా ‘2.0’ కావడం విశేషం. ఈ చిత్రానికి 4డి ఫార్మాట్‌లో సౌండ్‌ డిజైన్‌ చేయడం మరో విశేషం. ఈ చిత్రాన్ని నవంబర్‌ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు వెర్షన్‌ను ఎన్‌.వి.ఆర్‌. సినిమా పతాకంపై ప్రముఖ నిర్మాత ఎన్‌.వి.ప్రసాద్‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. కాగా, ఈ చిత్రం ట్రైలర్‌ను నవంబర్‌ 3న చెన్నైలో విడుదల చేశారు. 

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా కొందరు సెలబ్రిటీలు శంకర్‌ను కొన్ని ప్రశ్నలడిగారు. వాటికి శంకర్‌ సమాధానాలిచ్చారు. మరోవైపు ఆయన కూడా తన స్పీచ్‌ ఇచ్చారు. 

ప్రశ్నలు - సమాధానాలు! 

రాజమౌళి ప్రశ్న: ఇంత పెద్ద బడ్జెట్‌ సినిమాను తీస్తున్నప్పుడు ప్రెజర్‌ను ఎలా మేనేజ్‌ చేశారు? రోబో తర్వాత రజనీగారి ఫ్యాన్స్‌కి ఎక్స్‌పెక్టేషన్స్‌ ఎక్కువుంటాయి. వాటిని ఎలా మీట్‌ చేయబోతున్నారు? 

శంకర్‌: నేను రాజమౌళిగారికి పెద్ద ఫ్యాన్‌ని. ఆయన ఇండియన్‌ సినిమాకు చాలా గౌరవం తెచ్చిన వ్యక్తి. ప్రెజర్‌ని హ్యాండిల్‌ చేయడం అనేది ఇంకా ఎక్కువ పనిచేయడమే. సినిమాకు సంబంధించిన ప్రతి ఫ్యాక్ట్‌ని ఎనలైజ్‌ చేస్తాను. అన్నీ కరెక్ట్‌ గా ఉన్నాయా లేదా అని ఆలోచిస్తాను. ఎక్స్‌పెక్టేషన్‌ గురించి చెప్పేటప్పుడు ‘2.0’లో రజనీసార్‌ని వసీగా, చిట్టిగా, 2.0గా, జెయింట్‌ చిట్టిగా చూస్తాం. ఇంకా కొన్ని సర్‌ప్రైజ్‌లున్నాయి. ఎక్స్‌పెక్టేషన్‌ని మీట్‌ అవుతుందని నేను నమ్ముతున్నా. 

శివరాజ్‌ కుమార్‌: మీకు ఇలాంటి ఐడియాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? టైటిల్స్‌ అంత యాప్ట్‌ గా ఎలా పెడుతున్నారు? మీకు కుదిరితే భవిష్యత్తులో మీతో ఒక సినిమా చేయాలని ఉంది. 

శంకర్‌: ఇలాంటి ఆలోచనలు గాలి నుంచి వస్తాయా? పైనుంచి వస్తాయా? అనేది నాకు తెలియదు. కానీ ఆడియన్స్‌కి ఏదో కొత్తగా చూపించాలని ఆలోచిస్తాను. ఆ ఆలోచనల నుంచే వస్తాయేమో. ఇక కథ గురించి ఆలోచించేటప్పుడే సరైన టైటిల్‌ వస్తుంది. ఒకవేళ రాకపోతే ఎనలైజ్‌ చేసి పెట్టడమే. ‘2.0’ విషయానికి వస్తే.. ఈ టైటిల్‌ గురించి మాట్లాడాలంటే.. మామూలుగా టెక్నికల్‌ లాంగ్వేజ్‌లో చెప్పేటప్పుడు వెర్షన్‌ సెకండ్‌ అని, ఇంకోటని అంటారు. 2.0 అని అంటే ఏ లాంగ్వేజ్‌ అయినా తప్పకుండా రీచ్‌ అవుతుందనిపించింది. అందుకే పెట్టాను. కన్నడ సూపర్‌స్టార్‌ అయి ఉండి ఆయన నాతో పనిచేయాలనుకోవడం చాలా గౌరవంగా భావిస్తున్నా. తప్పకుండా చేస్తాను. 

అభిమానుల ప్రశ్నలు! 

ఇన్ని ప్రెజర్స్‌ని దాటుకుని మిమ్మల్ని ఎక్కువ మోటివేట్‌ చేసిందేంటి? 

- ఆడియన్స్‌ నన్ను మోటివేట్‌ చేశారు. 

ఫిఫ్త్‌ ఫోర్స్‌ గురించి మాట్లాడారు. అలాగంటే ఏంటి? 

- మనకు నాలుగు ఫోర్స్‌ తెలుసు. ఐదో ఫోర్స్‌ అనేది నెగటివ్‌ ఎనర్జీ. దాన్ని ఎలా కొలవాలని అందరూ పరిశోధనలు చేస్తున్నారు. అదే ఫిఫ్త్‌ ఫోర్స్‌. 

3.0 వస్తుందా? 

- 3.0 కోసం చిన్న చిన్న ఐడియాస్‌ మైండ్‌లో ఉన్నాయి. కానీ ఈ సినిమా తర్వాత దాని కథ వర్కవుట్‌ అయితే చేస్తాను. 

కన్నడ నటుడు ఉపేంద్ర ప్రశ్న: నాలాంటి డైరెక్టర్‌ కమ్‌ హీరోకి, శంకర్‌గారు, రజనీగారు ఏమైనా టిప్స్‌ ఇస్తారా? 

శంకర్‌: నేనేంటి ఆయనకు టిప్స్‌ ఇచ్చేది. ఆయన గొప్ప డైరెక్టర్‌. ఆయన 'ఉపేంద్ర', 'ఎ' అనే సినిమాలు నాకు నచ్చిన సినిమాలు. ఇన్‌స్పయిరింగ్‌గా ఉంటాయి. 'ఎ' సినిమా ఫస్ట్‌ సీనే క్లైమాక్స్‌లా ఉంటుంది. ఎవరికైనా వర్తించే సూత్రం ఒకటే. మీకు కన్వినియంట్‌ నిర్మాత, ప్రొడ్యూసర్‌, టెక్నీషియన్స్‌తో పనిచేయవద్దు. సరైన సబ్జెక్ట్‌ని ఎంపిక చేసుకుని, దానికి తగ్గ టెక్నీషియన్స్‌ని ఎంపిక చేసుకుని పనిచేస్తే అన్ని సినిమాలు విజయం సాధిస్తాయి. 

Question and Answers at 2.0 Trailer Launch:

2.0 Trailer Launch details
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs