Advertisement
Google Ads BL

బన్నీ ఓకే అంటే త్రివిక్రమ్ ఆ కథతో రెడీ!


మాటలు మాంత్రికుడు మంచి రచయితే కానీ మంచి కథకుడు కాదు. ఇది నిజం. ఒప్పుకోవాల్సిందే. ఇది చాలాసార్లు ప్రూవ్ అయింది. తన కథలను ఏదొక హాలీవుడ్ మూవీ నుండి తీసుకోవడం కానీ లేదా నవలల నుంచి ఐడియాలు తీసుకుని తన స్టైల్‌లోకి మార్చుకుని స్టోరీ ని రెడీ చేస్తుంటాడు. అఆ, అజ్ఞాతవాసి విషయంలో ఇదే చేసాడు త్రివిక్రమ్. ఒక నవల నుంచి అఆ, ఓ హాలీవుడ్ మూవీ నుండి అజ్ఞాతవాసి  చిత్రాలను తన స్టైల్‌లోకి మార్చుకుని సినిమాలుగా తీశాడు త్రివిక్రమ్.

Advertisement
CJ Advs

ఇక రీసెంట్‌గా అరవింద సమేతలో మొండికత్తి కాన్సెఫ్ట్‌ను ప్రముఖ కథకుడు వేంపల్లి గంగాధర్ నుంచి తీసుకున్నాడనే న్యూస్ ఇప్పటికే బయటకు వచ్చింది. ఈసినిమా సక్సెస్ అయిపోయింది కాబట్టి దీని గురించి ఎవరు మాట్లాడడంలేదు. మరి బన్నీ సినిమా కోసం త్రివిక్రమ్ ఏం చేస్తున్నారు? ఇదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ అయింది. బన్నీ సినిమా కోసం త్రివిక్రమ్ ఓ హిందీ మూవీని రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట.

‘సోను కె టిటు కి స్వీటీ’ అనే హిందీ సినిమా లైన్ తీసుకుని దాన్ని త్రివిక్రమ్ తన తరహాలో కథను మార్చి పక్కా అవుట్ అండ్ అవుట్ ఫన్ మూవీలా తీర్చిదిద్దాలనుకుంటున్నారట. బన్నీకి ఇప్పటికే ఈ స్టోరీ లైన్ చెప్పినట్టు తెలుస్తుంది. బన్నీ ఓకే అంటే ఈసినిమానే సెట్స్ మీదకు వెళ్లే అవకాశముందని సమాచారం.

Story Ready for Allu Arjun and Trivikram Combo:

Trivikram To Remake of Sonu Ke Titu Ki Sweety Movie With Allu Arjun
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs