Advertisement

‘టాక్సీవాలా’ రిలీజ్ డేట్ ఫిక్స్


నవంబర్ 16న విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’... వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

Advertisement

‘‘పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం’’ చిత్రాలతో కమర్షియల్ స్టామినా ఉన్న స్టార్ హీరోగా ఎదిగిన విజ‌య్‌ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సీవాలా’. జిఏ2 పిక్చ‌ర్స్ మ‌రియు యు.వి. క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఎస్‌కె‌ఎన్ ఈ చిత్రంతో నిర్మాతగా.. రాహుల్ సంకృత్యాన్ దర్శకుడిగా పరిచయమౌతున్నారు. అద్భుతమైన గ్రాఫిక్స్ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయనున్నాయి. ఈ చిత్రంలోని గ్రాఫిక్స్‌కి సంబంధించిన పనుల కారణంగానే విడుదల విషయంలో కాస్త ఆలస్యమైంది. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాని జిఏ2 పిక్చర్స్, యు.వి క్రియేషన్స్ నిర్మిస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. గీత గోవిందం తర్వాత విజయ్ దేవరకొండకు ఏర్పడిన క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకొని సస్పెన్స్, సైంటిఫిక్ థ్రిల్లర్ కథాంశంతో, హిలేరియస్ కామెడీతో ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్‌కి క్రిటిక‌ల్ అప్లాజ్ రావ‌టం విశేషం.  ప్ర‌స్తుతం షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని పోస్ట్‌ ప్రొడ‌క్ష‌న్ శరవేగంగా జ‌రుపుకుంటోంది. నవంబర్ 16న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎస్‌.కె.ఎన్‌ మాట్లాడుతూ.. ‘‘విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్, పాపులారిటీ దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని నిర్మించాము. విజ‌య్ ఇమేజ్‌కి తగ్గట్టుగానే అన్ని వర్గాల్ని ఎంటర్‌టైన్ చేసే విధంగా దర్శకుడు రాహుల్ తీర్చిదిద్దాడు. విజయ్ మేనరిజమ్స్ యూత్‌ని విప‌రీతంగా ఆక‌ట్టుకుంటాయి, బాడీ లాంగ్వేజ్, క్యారెక్టరైజేషన్ ఆడియెన్స్‌ని మెస్మరైజ్ చేస్తాయి. గీత గోవిందం వంటి భారీ బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత ఏర్పడిన అంచనాలను దృష్టిలో ఉంచుకొని టాక్సీవాలాను గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నాం. డైరెక్టర్ రాహుల్ టేకింగ్, సుజిత్ విజువల్స్, జేక్స్ మ్యూజిక్, కృష్ణకాంత్ లిరిక్స్, జాషువా స్టంట్స్ ఈ చిత్రం‌లో హైలైట్‌గా నిలుస్తాయి. స్ట్రాంగ్ కంటెంట్, ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ చిత్రాన్ని గ్రాండియర్‌గా నిర్మించాం. ప్రస్తుతం చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రంలో గ్రాఫిక్స్ చాలా కీలకం. బెటర్ క్వాలిటీ గ్రాఫిక్స్ కోసమే ఈ చిత్రం విడుదల కాస్త ఆలస్యమైంది. జీఏ2 పిక్చర్స్, యు.వి క్రియేషన్స్ క్వాలిటీ విషయంలో ఎప్పటికీ కాంప్రమైజ్ కావనే విషయం తెలిసిందే. హిలేరియస్ సస్పెన్స్ సైంటిఫిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ  చిత్రాన్ని అత్యధిక థియేటర్లలో నవంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నాం..’’ అని అన్నారు. 

Taxiwala Release Date Fix:

Taxiwala Release on Nov 16
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement