Advertisement

నిర్మాతగా మారడానికి కారణమదే: సుధీర్


టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, ఘట్టమనేని ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ వంటి పట్టున్న కుటుంబాలు... ఆయా ఫ్యామిలీల నుంచి వస్తున్న నటీనటులు ఉన్నారు. వాస్తవానికి ఇతర హీరోలను పట్టించుకున్నా, పట్టించుకోకపోయినా కూడా తమ ఫ్యామిలీ హీరోల విషయంలోనైనా వారి కుటుంబాల నుంచి మద్దతు అవసరం. అలా జరిగితేనే కొత్తగా వచ్చిన ఆ ఫ్యామిలీ హీరోలకు కూడా వారి ఫ్యాన్స్‌ మద్దతు ఉంటుంది. అయితే గత కొంతకాలంగా నందమూరి ఫ్యామిలీలో బాలయ్య సపోర్ట్‌ యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌కి, పవన్‌కళ్యాణ్‌, అల్లుఅర్జున్‌, నాగార్జున, సుశాంత్‌, సుమంత్‌ వంటి వారికి పెద్దగా పొసగదనే వార్తలు వస్తూ ఉన్నాయి. పవన్‌-బన్నీల ఫ్యాన్స్‌, 'బాలయ్య-ఎన్టీఆర్‌' వంటి హీరోల విషయంలో కూడా ఫ్యాన్స్‌ మిగిలిన వారిని తమ వారిగా ప్రమోట్‌ చేసుకోలేకపోతున్నారు. 

Advertisement

ఇక ఘట్టమనేని ఫ్యామిలీ విషయానికి వస్తే సూపర్‌స్టార్‌ కృష్ణ చిన్నల్లుడు, ప్రియదర్శిని భర్త పోసాని సుధీర్‌బాబు హీరోగా పరిచయం అయినా కూడా ఆయన చిత్రాల విషయంలో మహేష్‌బాబు ఎందుకో గానీ పెద్దగా మాట సాయం కూడా చేయడం లేదు. తన ఇంకో బావ గల్లా జయదేవ్‌ కుమారుడు గల్లా అశోక్‌ మొదటి చిత్రం విషయంలో దిల్‌రాజుని ఒప్పించి ముందుగానే అశోక్‌ ఎదుగుదలకు కృషి చేస్తోన్న మహేష్‌, సుధీర్‌బాబు చిత్రాల విషయంలో మాత్రం పెద్దగా స్పందించడం లేదు. ఇక విషయానికి వస్తే తనకెరీర్‌లో 2010లో 'ఏ మాయచేశావే'లో జెస్సీ అన్నయ్యగా పరిచయం అయి, ఆ తర్వాత 'ఎస్‌ఎంఎస్‌' (శివ మనసులో శృతి) చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు సుధీర్‌బాబు. ఆ తర్వాత ఆయన నటించిన 'ప్రేమకథా చిత్రం' పెద్ద విజయం సాధించింది. 'ఆడు మగాడ్రా బుజ్జీ, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, మోసగాళ్లకు మోసగాడు, భలే మంచి రోజు, శ్రీశ్రీ, శమంతకమణి' చిత్రాలలో నటించిన సుధీర్‌బాబు, 'దొంగాట'లో అతిధి పాత్ర, బాలీవుడ్‌ 'భాఘీ' చిత్రంలో విలన్‌ పాత్రలను పోషించాడు. ఇటీవల ఆయన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నటించిన 'సమ్మోహనం' ఆయన కెరీర్‌లోనే పెద్ద హిట్‌గా నిలిచింది. 

కానీ నేడు ఆయన నటిస్తున్న తదుపరి చిత్రం 'నన్ను దోచుకుందువటే' విడుదల అవుతోంది.ఈ సందర్భంగా సుధీర్‌బాబు మాట్లాడుతూ, హీరోగా ప్రేక్షకుల ముందుకు నేను రావడానికి చేసిన ప్రయత్నాలు మొదట్లో నాకు చేదు అనుభవాలను మిగిల్చాయి. బ్యాగ్రౌండ్‌ ఉన్న నాకే ఇన్ని తిరస్కారాలు ఎదురైతే, ఎన్నో ఆశలతో పరిశ్రమకు వచ్చే యంగ్‌ టాలెంటెడ్‌ పర్సన్స్‌ పరిస్థితి ఏమిటా? అని బాధగా అనిపించింది. నేను ఒక పొజిషన్‌కి వచ్చిన తర్వాత కొత్తవారికి అవకాశాలు ఇవ్వాలని నాడే నిర్ణయించుకున్నాను. దాంతోనే ఈ చిత్రం ద్వారా ఆర్‌.ఎస్‌.నాయుడు అనే దర్శకుడిని పరిచయం చేస్తున్నాను. ఒక పట్టుదల అనేది లేని నిర్మాతలు తీసిన చిత్రాల వల్ల నా చిత్రాలు సరిగా ఆడలేదు. నేను నిర్మాతగా మారడానికి ఇది మరోకారణం. ఈ సినిమా నాకు ఖచ్చితంగా సక్సెస్‌ని ఇస్తుందని నమ్ముతున్నాను అని నమ్మకంతో సుధీర్‌బాబు చెప్పుకొచ్చాడు. 

Sudheer Babu Latest Interview:

This is reason for Sudheerbabu Turns Producer
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement