Advertisement

సమంత బాధను.. నాగ్ రివీల్ చేశాడు


నాగ చైతన్య ని పెళ్లాడిన హాట్ హీరోయిన్ సమంత అక్కినేని కోడలిగా బరువు బాధ్యతలు పెరిగాయని.. సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతూనే ఉంది. ఇక హీరోయిన్ గా సమంత కెరీర్ లో పెళ్లి తర్వాత కూడా దూసుకుపోతుంటే.. నాగ చైతన్య మాత్రం పెళ్ళికి ముందు పరిస్థితే పెళ్లి తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది. అయితే ఈ వినాయక చవితికి సమంత యు టర్న్ మీద పోటీగా శైలజా రెడ్డి అల్లుడు సినిమాని విడుదల చేశాడు. మరి ఒకే రోజు భార్య భర్తలు తమ తమ సినిమాలతో పోటీ పడడం అనేది ఏ భాషలోనైనా చాలా అరుదుగా జరుగుతుంది. రెండు వేర్వేరు జోనర్స్ తో తెరకెక్కిన నాగ చైతన్య శైలజా రెడ్డి అల్లుడు, సమంత యు టర్న్ సినిమాలు సెప్టెంబర్ 13 న విడుదలయ్యాయి.

Advertisement

సమంత యు టర్న్ సినిమాకి హిట్ టాక్ రావడం, చైతన్య శైలజా రెడ్డి అల్లుడుకి యావరేజ్ టాక్ రావడమే కాదు.... నెగెటివ్ రివ్యూ కూడా వచ్చాయి.  మరి భర్త మీద భార్య హిట్ కొట్టడం అనేది ఏ భార్య కైనా బాధ వేసే విషయమే. ఇక భార్య మీద భర్త హిట్ కొడితే అందులో పెద్దగా విషయం ఉందని అనిపించదు. అయితే భర్త నాగ చైతన్య శైలజా రెడ్డి అల్లుడు సినిమాకి నెగెటివ్ రివ్యూస్ రావడంతో.. తన సినిమా యు టర్న్ సినిమా హిట్ అయినప్పటికీ.. సమంత హ్యాపీ గా లేదట. ఈ విషయాన్ని గత రాత్రి జరిగిన దేవదాస్ ఆడియో వేడుకలో సమంత మామ గారు దేవదాస్ హీరో నాగార్జున రివీల్ చేశాడు. సమంతకి  యు ట‌ర్న్‌ బాగుంద‌న్న సంతోషం కంటే.. శైల‌జారెడ్డి అల్లుడు సినిమాకి నెగెటివ్ రివ్యూలు వ‌చ్చాయ‌న్న బాధే ఎక్కువ క‌నిపించింద‌ని చెప్తున్నాడు నాగ్.

వైఫ్ అండ్ హస్బెండ్ సినిమాలు ఒకే రోజు విడుద‌ల అవ్వ‌డం నేనెప్పుడూ చూడ‌లేదు. అయితే ఆ రెండు సినిమాలు ఒకే రోజు విడుదలై బాగా ఆడాయి. అయితే ఆ రోజు ఉద‌యం శైల‌జారెడ్డి అల్లుడు రివ్యూలు చూసి స‌మంత బాధ ప‌డింది. మ‌రేం ఫ‌ర్వాలేదు వ‌సూళ్లు బాగుంటాయి అన్నాను. నేను అన్న‌ట్టే శైల‌జారెడ్డికి మంచి వ‌సూళ్లు ద‌క్కాయి. యు ట‌ర్న్ రివ్యూలు బాగున్నా వ‌సూళ్లు స‌రిగా లేవు. ఆదివారం నాటికి వ‌సూళ్లు పెరుగుతాయి అని చెప్పా. అన్న‌ట్టుగానే వ‌సూళ్లు పెరిగాయి. సెప్టెంబ‌రు మాకు బాగా క‌లిసొచ్చింది. ఈ సెప్టెంబ‌రులోనే వ‌స్తున్న దేవ‌దాస్ ఓ పండ‌గ‌లా ఉంటుంది... అంటూ నాగ్ సమంత బాధను అభిమానుల ముందు చెప్పేశాడు. అంతేకదా.. భార్య తన సంతోషం కన్నా.. భర్త సంతోషానికి ఎక్కువ విలువనిస్తుంది. 

samantha disappointed with chaitu movie Result:

samantha unhappy with Shailaja reddy alludu result says Nagarjuna
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement