Advertisement

శ్రీరెడ్డా.. ఆ 2 పార్టీలు అంతగా దిగజారాయా?


శ్రీరెడ్డి... ఈమెకి ఈమె తనను చూసి అందరు భయపడుతున్నారని భావిస్తూ ఉండవచ్చు. కానీ పేడ మీద రాయేస్తే అది మన మొహం మీదనే పడుతుందనే ఉద్దేశ్యంతోనే ఏదో హిస్టీరియా వచ్చినట్లు ఎవరిపై అంటే వారిపై పిచ్చిగా మాట్లాడే ఆమెతో ఎందుకులే అని అందరు మౌనంగా ఉన్నారు గానీ ఈమె ప్రతి మాటకి సమాధానలు, ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. టాలీవుడ్‌, కోలీవుడ్‌లు అయిపోయాయి. ప్రస్తుతం ఆమె చూపు ఏకంగా సచిన్‌ టెండూల్కర్‌ మీదనే పడింది. పిచ్చోడి చేతిలో రాయి అంటే బహుశా ఇదేనేమో..!

Advertisement

ఇక తాజాగా తన రాజకీయ రంగ ప్రవేశంపై శ్రీరెడ్డి స్పందించింది. నాకు రాజకీయాలలోకి వచ్చే ఆసక్తి లేదు. నన్ను రాజకీయాలలోకి రావాలని రెండు పార్టీలు ఆహ్వానిస్తున్నాయి. అయితే నాకు రాజకీయాలపై ఆసక్తి లేదని వారికి చెప్పాను. రాబోయే ఎన్నికల్లో పవన్‌కళ్యాణ్‌కి చెందిన జనసేన పార్టీకి ఘోర పరాభవం తప్పదు. జనసేన కేవలం 3,4 సీట్లకే పరిమితం అవుతుంది. 

సోషల్‌మీడియాలో ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని చెప్పుకొచ్చింది.. అయినా ఆమెని రాజకీయాలలోకి రమ్మని పిలుస్తున్న ఆ రెండు పార్టీలు ఏమిటబ్బా? ఈ రెండు పార్టీలు అంతగా దిగజారాయా? ఆ పార్టీలు ఏమిటో తెలిస్తే శ్రీరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించిన పార్టీల సిద్దాంతాలు ఎంత గొప్పవో అర్ధం అవుతుంది...! 

Sri Reddy Says Pawan Kalyan Will Defeat In Elections:

Pawan Will Face Ignominious Defeat  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement