Advertisement

హీరోతో పనిలేకుండా హిట్టుకొట్టిన రానా..!


ఈ వారం ఎప్పటిలాగే పొలోమని బోలెడన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. ఆ సినిమాల్లో ఎప్పటిలాగే ఒక్క సినిమా మాత్రమే హీరోగా నిలిచింది. ఈ శుక్రవారం ఏకంగా సునీల్ - అల్లరి నరేష్ ల సిల్లీ ఫెలోస్, బ్రహ్మి కొడుకు నటించిన మను, సూపర్ స్కెచ్ వంటి పేరు ఊరు లేని సినిమా, ప్రేమకు రైన్ చెక్ అనే చిన్న సినిమా, ఇంకా రానా సమర్పణలో వచ్చిన కేరాఫ్ కంచరపాలెం సినిమాలు విడుదలైనాయి. అల్లరి నరేష్ - సునీల్ స్క్రీన్ షేర్ చేసుకున్న సిల్లీ ఫెలోస్ నిజంగానే సిల్లీగా కనబడి ప్రేక్షకులను బోర్ కొట్టించేసింది. ఈ సినిమాలో ఏ ఒక్క కామెడీ డైలాగ్ కూడా ఆకట్టుకోలేదు. అల్లరి నరేష్ - సునీల్ లు ఇద్దరు హీరోలుగా విఫలమయ్యారు. సునీల్ టైమింగ్, అల్లరి నరేష్, అక్కడక్కడా పేలిన కామెడీ తప్ప సినిమాలో ఎలాంటి అంశం ప్రేక్షకుడిని ఆకట్టుకోలేదు. ఇక హీరోయిన్ కానీ, సంగీతం కానీ, కథ కానీ, ఇంకా చెప్పాలంటే ఈ సినిమా వైఫల్యానికి అనేక కారణాలున్నాయి. 

Advertisement

ఇక కమెడియన్ బ్రహ్మానందం కొడుకుగా ఇండస్ట్రీకి పరిచయమైన రాజా గౌతమ్ ఎట్టకేలకు తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. మనుగా ఆ క్యారెక్టర్ లో ఒదిగిపోతూ చాలా సహజంగా నటించాడు. మను సినిమాలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, ఎంచుకున్న కథ వినూత్నంగా ఉండి, సినిమాటోగ్రఫీ కూడా చాలా బావున్నప్పటికీ... సినిమాలో సాగదీత ఎక్కువైంది. అలాగే అవసరానికి మించిన డిటైలింగ్... నిడివి ఎక్కువ కావడం... స్క్రీన్ ప్లే బోరింగ్ తో నస పెట్టిన మనుగా ఈ సినిమా మిగిలిపోయింది. ఇక సూపర్ స్కెచ్ కానివ్వండి, ప్రేమకు రైన్ చెక్ కానివ్వండి అసలు ఎప్పుడు తెరకెక్కాయి.. ఎందుకు విడుదలయ్యాయి ప్రేక్షకుడికి ఒక క్లారిటీ లేదంటే నమ్మాలి. ఇక ఈ వారం చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి హీరోలేని సినిమా హిట్ కావడం అంటే ఏమిటో కేరాఫ్ కంచరపాలెం నిరూపించింది. 

అది కూడా  చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా కేరాఫ్ కంచెరపాలెం. మనసు పెట్టి తీయాలే కానీ హత్తుకునే కంటెంట్ ఉంటే ప్రేక్షకుడు ఏ సినిమా అయినా ఆదరిస్తాడు  అనడానికి కంచెరపాలెం సినిమా నిరూపించింది. కామెడీ, ఎమోషన్స్, సెంటిమెంట్, రొమాన్స్ ఏది ఎంత ఉండాలో అంతే కొలతల  ప్రకారం రాసుకుని మరీ తీసిన  తీరు హృదయాలను కదిలిస్తుంది. అక్కడక్కడా నెమ్మదించిన ఫీలింగ్ కలిగినా అది సినిమాలో లీనమైన ప్రేక్షకుడు పెద్దగా ఇబ్బంది ఫీల్ అవ్వడు. దర్శకుడు వెంకటేష్ మహా డైరెక్షన్ స్కిల్స్ కానీ... మేకింగ్ స్టయిల్ కానీ... నటీనటుల నటన కానివ్వండి, మ్యూజిక్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అన్ని కంచెరపాలెం సినిమా విజయానికి దోహదం చేశాయి. ఈ సినిమాకి రానా ప్రమోషన్స్ కూడా బాగా కలిసొచ్చాయి. ఇక ఈ వారం విడుదలైన అన్ని సినిమాల్లో లో బడ్జెట్ గా వచ్చిన కంచెర్లపాలెం మంచి హిట్ అయ్యింది. కాకపోయే కమర్షిల్ గా కంచెరపాలెం సినిమా కలెక్షన్స్ ఎలాఉంటాయో అనేది ఇప్పుడే చెప్పడం కష్టం. 

Rana got hit with Careof kancharapalem:

Careof kancharapalem Hit at box office
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement