Advertisement

‘అరవింద సమేత’లో నాగబాబు రోల్ ఇదేనా?


త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ - పూజ హెగ్డే - ఈషా రెబ్బ కలిసి నటిస్తున్న 'అరవింద సమేత - వీర రాఘవ' షూటింగ్ అప్ డేట్ కంటే ఎక్కువగా ఆ సినిమా షూటింగ్ లొకేషన్స్ నుండి పిక్స్ లీక్ అవడం అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్ అయ్యి కూర్చుంది. షూటింగ్ లొకేషన్స్ లో కొందరు ఆకతాయిలు అక్కడ జరిగే సన్నివేశంలో కొన్ని ఫొటోస్ ని ఎడా పెడా సోషల్ మీడియాకి అందించేస్తున్నారు. మరి సోషల్ మీడియా అంటే అవి సెకన్స్ లోనే వైరల్ అవుతాయనే విషయం తెలిసిందే. త్రివిక్రమ్ ఎంతగా కట్టుదిట్టం చేసినా షూటింగ్ స్పాట్ నుండి ఏదో ఒక పిక్ లీక్ అవుతూనే ఉంది. ఇకపోతే షూటింగ్ మొదలైనప్పటి నుండి షూటింగ్ ని పరిగెత్తిస్తున్న త్రివిక్రమ్ అండ్ ఎన్టీఆర్ లు మరికొద్ది రోజుల్లోనే షూటింగ్ ని కంప్లీట్ చేసేస్తారని అంటున్నారు. ఇక రాయలసీమ నేపథ్యంలో ఉండబోతున్న అరవింద సమేత సినిమాలో ఎన్టీఆర్ రాయలసీమ భాష ట్రై చేస్తున్నాడంటున్నారు. 

Advertisement

అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ కి తండ్రిగా మెగా హీరో నాగబాబు నటిస్తున్న విషయం తెలిసిందే. నాగ బాబు ఎన్టీఆర్ కి తండ్రిగా అలాగే ఈ సినిమాకి ఆయన పాత్ర కీలకంగా ఉంటుందని చెబుతున్నారు. అయితే ఎన్టీఆర్ కి తండ్రిగా నాగబాబు రాయలసీమలోని ఒక గ్రామానికి గ్రామ సర్పంచ్ గా తన పవర్ చూపించబోతున్నాడట. మరి మొన్నీమధ్యన ఎన్టీఆర్ నాగబాబుని కారులో కూర్చోబెట్టుకుని దీనంగా చూస్తున్న ఫొటోలో నాగబాబుకు గాయాలై.. స్పృహ లేని పరిస్థితి చూస్తుంటే ప్రచారం జరుగుతున్న ఈ న్యూస్ లో నిజం వుండొచ్చనే విషయం అర్ధమవుతుంది. మరి గ్రామ సర్పంచ్ గా నాగబాబు  మీద ప్రత్యర్ధులు ఎటాక్ చేస్తే.. అప్పుడు తండ్రిని కాపాడుకునే క్రమంలో వీర రాఘవ్ క్యారెక్టర్ లో చేస్తున్న ఎన్టీఆర్ పడుతున్న ఆవేదన ఆ పిక్ లో స్పష్టంగా తెలుస్తోంది.

ఇకపోతే అరవింద క్యారెక్టర్ లో పూజ హెగ్డే నటిస్తుండగా.. ఎన్టీఆర్ కి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా ఈషా రెబ్బ కనిపిస్తుంది. అలాగే తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో చినబాబు నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమా దసరా బరిలో  అక్టోబర్ 12  న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

Naga Babu Role in Aravinda Sametha Revealed:

Naga Babu Sarpanch in Aravinda Sametha Veera Raghava
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement