Advertisement

త్రివిక్రమ్, ఎన్టీఆర్.. హిట్‌ ఫార్ములాతోనే!


గడసరి అత్తను ఏడిపించి ఆమె కూతుర్లను ప్రేమలోకి దింపి అత్తతో ఆటాడే అల్లుళ్ల కథ అనేది తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక మంచి కమర్షియల్‌ హిట్‌ ఫార్ములా. మరోవైపు అత్త పొగరు దించుతూ, ఆమె కూతుర్లతో సరసాలాడుతూ సాగడం మరో ఫార్ములా. మొదటి ఫార్ములా కిందకి గుండమ్మకథ నుంచి నా అల్లుడు, రాబోయే శైలజారెడ్డి అల్లుడు వంటి చిత్రాలు వస్తాయి. ఇక అత్త పొగరు దించేందుకు అల్లుడు పట్టిన భరతం అధారంగా 'అత్తకుయముడు అమ్మాయికి మొగుడు, అల్లరి అల్లుడు' వంటి మూవీస్‌ ఎన్నింటినో చెప్పుకోవచ్చు. 

Advertisement

ఇక అత్తకు కూతుర్లయిన ఇద్దరితో రొమాన్స్‌ చేస్తూ ఉండటం అనేది 'నారి నారి నడుమ మురారి' నుంచి అంతకు ముందు.. ఆ తర్వాత కూడా అనేక చిత్రాలలో చూశాం. ఇక త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ విషయానికి వస్తే అక్కాచెల్లెల్లిద్దరితో సరసాలాడటం అనేది 'జల్సా'తో పాటు 'అత్తారింటికి దారేది' చిత్రంలో కూడా చూశాం. అక్క ప్రణీతను ముగ్గులోకి దించబోయి చెల్లెలు సమంతను ప్రేమించి పెళ్లిచేసుకోవడం 'అత్తారింటికి దారేది'లో కనిపిస్తుంది. 

ఇక తాజాగా త్రివిక్రమ్‌ మరోసారి అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్‌.. ఎన్టీఆర్‌ హీరోగా హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బేనర్‌లో రాధాకృష్ణ నిర్మాతగా 'అరవింద సమేత వీరరాఘవ' చిత్రం చేస్తున్నాడు. ఇందులో కూడా ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. మెయిన్‌ హీరోయిన్‌ పూజాహెగ్డే కాగా, రెండో హీరోయిన్‌ తెలుగమ్మాయి అయిన ఈషారెబ్బా. 

తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో కూడా పూజాహెగ్డే, ఈషారెబ్బాలు అక్కాచెల్లెళ్లుగా నటిస్తున్నారు. అక్కగా నటిస్తున్న ఈషారెబ్బాతో మొదట రొమాన్స్‌ చేసిన ఆ తర్వాత వీరరాఘవ చెల్లెలు పూజాహెగ్డేతో రొమాన్స్‌ నడుపుతాడట. ఇక గతంలో యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ 'నా అల్లుడు'లో ఇద్దరు అక్కచెల్లెళ్ల మధ్య, 'బృందావనం' చిత్రంలో ఇద్దరు స్నేహితురాళ్లతో ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. కాగా ఈచిత్రం విజయదశమి కానుకగా విడుదల కానుంది. 

Hit Formula to NTR And Trivikram Film:

NTR And Trivikram Srinvias movie Aravinda Sametha Latest Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement