Advertisement

నాగ్‌లో మార్పుకి కారణం తెలుసా?


సాధారణంగా ఆప్తులను, ఇతర సన్నిహితులను కోల్పోయినప్పుడు ఏ రోజైనా మనం కూడా వెళ్లిపోవాల్సిందే కదా..! ఈ జీవితం అశాశ్వతం అనే వైరాగ్యం వస్తుంది. కోటీశ్వరులైనా, పేదలైనా మరణానికి ఒక్కటే అనే జ్ఞానోదయం కలుగుతుంది. అటువంటిది నాగార్జునకు ఈ నాలుగైదేళ్ల కాలంలో తండ్రి మరణం. ఆయన చివరిరోజులు, చిన్నకుమారుడి తెరంగేట్రం, పెద్దకుమారుడు నాగచైతన్యకి సమంతతో వివాహం. చిన్నకుమారుడు అఖిల్‌కి శ్రియా భూపాల్‌తో నిశ్చితార్దం ఆగిపోవడం వంటి తీపి చేదు కలయికలు రుచి చూపాయి. 

Advertisement

ఇక శ్రీదేవి మరణం తన జీవితంలో ఎంతో మార్పును తీసుకుని వచ్చిందని నాగార్జున తాజాగా చెప్పారు. ఇన్ని నెలలు గడుస్తున్నా కూడా ఈ విషాదం నుంచి తాను బయటపడలేకపోతున్నానని, శ్రీదేవి మరణించిందంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని నాగార్జున అన్నారు. నా ప్రియమైన వారిని మరింత ప్రశంసించేలా, వారికి ఇంకా దగ్గరయ్యేలా చేసింది. దక్షిణాది, బాలీవుడ్‌లో కూడా నటిగా తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించుకున్న శ్రీదేవి సినీ పరిశ్రమకు చేసిన సేవలు ఎనలేనివి. 

నేను ఆమెతో వర్మ దర్శకత్వంలో 'గోవిందా గోవిందా' చిత్రంలో నటించాను. కెమెరా ముందుకు వెళితే ఎంతో సంతోషంగా ఉండే ఆమె కెమెరా ఆఫ్‌ అయిపోతే మాత్రం నిజజీవితంలోకి వచ్చేసేవారని నాగార్జున చెప్పుకొచ్చాడు. కాగా ప్రస్తుతం నాగార్జున వర్మ దర్శకత్వంలో 'గోవిందా గోవిందా' తర్వాత 'ఆఫీసర్‌' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం జూన్‌1న విడుదల సందర్భంగా నాగ్‌ ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. 

Big Change in Nagarjuna after Sridevi Death:

Nagarjuna on Sridevi: I will miss her for as long as I work
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement