Advertisement
Google Ads BL

కీర్తి సురేష్ కి మరో మహా బయోపిక్!


ప్రస్తుతం కీర్తి సురేష్ మహానటి సినిమాతో సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ లో ఉంది. మహానటి సినిమాలో సావిత్రి పాత్రను చేస్తున్న కీర్తి సురేష్ అచ్చం సావిత్రి పోలికలతో ఉండడమే ఆమెకి అదృష్టం కలిసి వచ్చింది. ప్రస్తుతం మహానటి ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న కీర్తి సురేష్ పైనే అందరి కళ్ళు ఉన్నాయి. రేపు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మహానటి మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఇలాంటి క్రేజీ బయోపిక్లో ఒదిగిపోయి నటించిన కీర్తి సురేష్ కి మరో క్రేజీ బయోపిక్ అవకాశం తగిలేలా కనబడుతుంది. 

Advertisement
CJ Advs

మరి ఆ బయోపిక్ లో గనక కీర్తి సురేష్ నటించింది అంటే... ఇక కీర్తికి ఎదురే ఉండదు. ఇంతకీ ఆ బయోపిక్ ఎవరి మీద అనుకుంటున్నారా? సినిమారంగంలోనూ, తమిళనాట రాజకీయాల్లోనూ చక్రం తిప్పి చివరికి అనారోగ్యం పాలై హాస్పిటల్ లోనే కన్ను మూసిన జయలలిత బయోపిక్ లో కీర్తి సురేష్ నటిస్తుందని న్యూస్ కోలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న హాట్ న్యూస్. మరి కీర్తి సురేష్ మహానటి ప్రమోషన్స్ లో భాగంగా ఈ బయోపిక్ పై చిన్నపాటి క్లూ కూడా ఇచ్చింది. అదేమిటంటే.. త్వరలోనే తాను తమిళంలో ఒక బయోపిక్ చేయబోతున్నట్లుగా చెప్పింది.

ఇకపోతే కీర్తి సురేష్ తో ఈ జయలలిత బయోపిక్ ని తెరకెక్కించబోయే నిర్మాతలు చర్చలు జరుపుతున్నట్టుగా టాక్. మరి కీర్తి ఒప్పుకోవడమే తరువాయి అంటున్నారు. మరి మహానటిగా కీర్తి సురేష్ ఇప్పటికే అందరి మనసులను కొల్లగొడుతుంది. నిజంగా మళ్ళీ జయలలిత బయోపిక్ లో గనక కీర్తి సురేష్ నటిస్తే ఇక ఆమెకి తిరుగుండదు. మరి జయలలితగా కీర్తి సురేష్ ఎలా ఉంటుందో అంటూ అప్పుడే చాలామంది ఊహాగానాలు చేసేస్తున్నారు.

Keerthi Suresh- jayalalitha biopic on Cards? :

Jayalalitha biopic hit the floors shortly
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs