Advertisement

రాజుని వదలని తేజ..!


తెలుగు సినిమాలలో 'చిత్రం, నువ్వునేను, జయం' ఇలా పలు చిత్రాలతో తనదైన ట్రెండ్‌ని సెట్‌ చేసిన దర్శకుడు తేజ.ఇక తేజ విషయానికి వస్తే ఆయన ఫాం కోల్పోయి ఎంతో కాలం అయింది. కానీ రానా దగ్గుబాటి తో చేసిన 'నేనే రాజు నేనే మంత్రి'తో కమర్షియల్‌గా మంచి విజయవంతం అయిన చిత్రాన్ని ఈయన తీశాడు. ఇప్పుడు పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌ చిత్రం అంటే తేజనే గుర్తుకు వచ్చేలా పరిస్థితి మారింది. 'నేనే రాజు నేనే మంత్రి' తర్వాత ఆయనకు వెంకటేష్‌తో ఓ చిత్రం, బాలయ్యాస్‌ ఎన్టీఆర్‌ బయోపిక్‌ వంటి రెండు అవకాశాలు వచ్చాయి. కానీ వెంకటేష్‌తో అనుకున్న 'ఆటానాదే వేటానాదే' అనే టైటిల్‌ని, హీరోయిన్‌ని, సురేష్‌ప్రొడక్షన్స్‌తో పాటు ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలని కూడా ఒప్పించి, వెంకటేష్‌కి సంబంధించిన ఓ లుక్‌ని కూడా రిలీజ్‌ చేసిన తర్వాత ఈ చిత్రం ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. 

Advertisement

దాంతో ప్రస్తుతం తేజ తన దృష్టిని అంతా బాలయ్యాస్‌ ఎన్టీఆర్‌ బయోపిక్‌పై పెట్టాడు. కాగా ఇటీవల ఆయన మరో దగ్గుబాటి హీరో రానాని కలిసి మరో కథ చెప్పాడట. 'నేనే రాజు నేనేమంత్రి'తో పొలిటికల్‌ థ్రిల్లర్‌ తీసిన ఆయన రానాతో చేయబోయే తదుపరి చిత్రం దేశభక్తి బ్యాక్‌డ్రాప్‌లో 1971 ఇండోపాకిస్తాన్‌ వార్‌ నేపధ్యంలో ఉంటుందని తెలుస్తోంది. ఇందులో రానా ఓ ఎయిర్‌ఫోర్స్‌ పైలెట్‌గా నటించున్నాడట. ఇక ఈ చిత్రాన్ని ముంబైకి చెందిన ఓ కార్పొరేట్‌సంస్థ తెలుగులోనే కాదు. తమిళ, హిందీ భాషల్లో కూడా ఏకకాలంలో రూపొందించనుందని తెలుస్తోంది. 

ఇక 'బాహుబలి,ఘాజీ, నేనేరాజు నేనేమంత్రి'తో పాటు తమిళంలో సుభాష్‌చంద్రబోస్‌ సైన్యంలో అధికారిగా ఓ తమిళ, తెలుగుచిత్రం, హిందీ , తెలుగులో 'అడవిరాముడు' అనే పేరుతో రెండు చిత్రాలు చేస్తున్నాడు. రానా ఈ రెండు చిత్రాలు పూర్తి చేసుకునే సమయానికి తేజ కూడా ఎన్టీఆర్‌ చిత్రం పూర్తి చేస్తాడు. వెంటనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. 

Rana Teams Up With Teja Again:

After Nenu Raju Nenu Manthri, Rana Daggubati one More Movie Teja
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement