Advertisement
Google Ads BL

మీకు తెలియకుండానే జరుగుతుందా?: పవన్!


దేనికైనా హద్దు ఉంటుంది. ముఖ్యంగా చాలా మంది మౌనాన్ని ఇతరులు చేతకానితనంగా భావిస్తుంటారు. కానీ అజాత శత్రువే అలిగిన నాడు అది మామూలుగా మాత్రం ఉండదు. ఇప్పుడు అదే విషయంలో పవన్‌ కూడా ఇంతకాలం తన మౌనాన్ని మరింత గట్టిగా, బహుశా మొదటి సారి ఎంతో స్పష్టంగా తెలియజేశాడు. పవన్‌ వరుస ట్వీట్స్‌ చేస్తూ, చంద్రబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. కిమిడి కళావెంకట్రావ్‌ గారి ఆహ్వానానికి కృతజ్ఞతులు. మీరు చేస్తున్న ధర్మ పోరాట దీక్షలో రాష్ట్రం మేలు గురించి పోరాడాలని కోరారు. రాష్ట్రానికి మేలు జరగాలని గత ఎన్నికల్లో టీడీపీని సపోర్ట్‌ చేశాం. మీరు, మీ అబ్బాయిలు స్నేహం అందించిన చేతినే వెనుక నుంచి మీడియా శక్తులతో చంపించివేస్తున్నారు. మిమ్మల్ని నమ్మటం ఎలా...? మీరు అధికారంలోకి రావడానికి కృషి చేసినందుకు మాకిచ్చిన బహుమతి ఇది. 

Advertisement
CJ Advs

సెక్రటేరియట్‌ సాక్షిగా మీ కుమారుడు, అతని స్నేహితులు, మీ అనుకూలమైన టివి9, ఎబిఎన్‌ ఆంధ్రజ్యోతితో పాటు పలు చానెల్స్‌, మీడియా, సోషల్‌మీడియా ద్వారా నా మీద, నాకుటుంబ సభ్యుల మీద, నన్ను అభిమానించే వారి మీద నిరవధిక మీడియా అత్యాచారం ఆరునెలలుగా జరిపారు.. జరుపుతున్నారు. దాని కోసం గత కొన్నిరోజులుగా 10కోట్లు ఖర్చుపెట్టి నాకు సంబంధం లేని విషయాలలోకి నన్ను లాగి, బజారులో నా తల్లి మీద బూతులు తిట్టించి, వాటిపై డిబేట్లు నిర్వహించి, చూపించిందే మరలా మరలా చూపిస్తున్నారు. వీటిని మీ పార్టీ వ్యక్తులు సర్క్యులేట్‌ చేస్తున్నారు. ఇప్పుడు మీ పిలుపుని ఎలా తీసుకోవాలి? 

వర్మ అనే దర్శకుడు, శ్రీసిటీ ఓనర్‌, టివి9ఓనర్‌ అయిన శ్రీనిరాజు పదికోట్లు ఖర్చుపెట్టి టివి 9 మీడియా డిజైనర్‌ టివి9 రవిప్రకాష్‌తో పాటు ఈ ముగ్గురు కలిసి మీ అబ్బాయి, అతని స్నేహితుడు కిలారు రాజేష్‌ కలసి చేస్తున్నది మీరు తెలియదని అనుకోవాలా? అంటూ పవన్‌ సూటిగా ప్రశ్నించాడు. నేడు మీడియా అంతా కమ్మ, రెడ్డి వంటి వారి చేతిలో బంధీగా మారిన నేపధ్యంలో పవన్‌ ఇటు తెలుగుదేశం మీడియా సంస్థలకు, అటు జగన్‌ మీడియా సంస్థలు రెండింటికి దూరంగా ఉంటూ అందరిపై తనదైన శైలిలో ప్రజాసమస్యలపై స్పందిస్తూ ఉండటంతో ఆయా మీడియా సంస్థలు ఇలా పవన్‌ని టార్గెట్‌ చేసుకోవడం నిజమనే చెప్పాలి. 

Pawan Kalyan Tweet to CM Chandrababu:

Pawan Kalyan Tweets Sensation in social Media
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs