Advertisement
Google Ads BL

సందీప్ రెడ్డితో సినిమా అని చెప్పేశాడు..!


'అర్జున్ రెడ్డి' సినిమాతో టాలీవుడ్ రేంజ్ ని మార్చేశాడు డైరెక్టర్ సందీప్ వంగా. ఆ సినిమా వచ్చి చాలా కాలం అవుతున్న తన నెక్స్ట్ మూవీపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు సందీప్. అయితే అతను తన రెండో మూవీ ఎవరితో చేస్తాడో అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. అయితే తన నెక్స్ట్ మూవీ మహేష్ తో చేస్తున్నాడు అని చాలా టాక్స్ నడిచాయి. కానీ ఇంతవరకు ఆ ప్రాజెక్ట్ మీద ఒక్క క్లారిటీ కూడా ఇవ్వలేదు. అయితే లేటెస్ట్ గా మహేష్ బాబు ఇచ్చిన మీడియా ఇంటర్వ్యూ లో తాను సందీప్ రెడ్డి వంగాతో ఓ సినిమా చేస్తున్నట్టు మహేష్ ధ్రువీకరించడం విశేషం.

Advertisement
CJ Advs

తన ఫ్యూచర్ ప్రాజెక్టులపై క్లారిటీ ఇచ్చాడు మహేష్. త్వరలో వంశీ పైడిపల్లి మూవీని స్టార్ట్ చేయనున్నట్టు చెప్పాడు. ఈ సినిమా తర్వాత సుకుమార్ తో ఒక సినిమా ఉంది అది అవ్వగానే సందీప్ సినిమా స్టార్ట్ చేస్తా అని చెప్పాడు. అర్జున్ రెడ్డి చూసి నేను ఫిదా అయిపోయానని చాలా బాగుంది సినిమా అని తెలిపాడు.

తొలి ప్రయత్నంలోనే  పెద్దగా పేరు లేని హీరోతో ‘అర్జున్ రెడ్డి’ లాంటి సెన్సేషనల్ మూవీ అందించిన సందీప్.. మహేష్ లాంటి స్టార్‌తో ఎలాంటి సినిమా తీస్తాడన్నది ఆసక్తిని కలిగించే విషయమే. అలాగే త్రివిక్రమ్ తో ఒక సినిమా చేస్తున్నట్టు చెప్పాడు కానీ అది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు ఒన్స్ ఫైనల్ అవ్వగానే అనౌన్స్ చేస్తానని చెప్పాడు మహేష్.

Mahesh Babu next with Arjun Reddy director:

Mahesh Babu said His next Projects in his Latest Interview 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs