Advertisement
Google Ads BL

ఆ ముగ్గురు హీరోలంటే ఇష్టం: స్నేహ!


ఏ భాషకి చెందిన హీరోయిన్లు అయినా తెలుగుకి వస్తే చిలక పలుకులు పలుకుతారు. తమకు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ల నుంచి నేటి యంగ్‌స్టార్స్‌ అందరి పేర్లు చెప్పి వారితో నటించాలని ఉందని చెబుతారు. కానీ కొందరు మాత్రం ముఖస్తుతికి తావు లేకుండా ఫ్రాంక్‌గా మాట్లాడుతారు. ఇక నిన్నటి హీరోయిన్‌ స్నేహ ప్రస్తుతం ప్రసన్నను వివాహం చేసుకుని తల్లి పాత్రని నిజ జీవితంలో పోషిస్తోంది. ఇక ఈమె కూడా 'సన్నాఫ్‌ సత్యమూర్తి'తో పాటు తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌చరణ్‌ నటిస్తున్న చిత్రంలో కీలకపాత్రను చేస్తోంది. ఇందులో ఈమె రామ్‌చరణ్‌కి పెద్ద వదిన పాత్రను చేస్తుంటే రామ్‌చరణ్‌ సోదరులుగా తమిళ మాజీ హీరో ప్రశాంత్‌, ఆర్యన్‌ రాజేష్‌, నవీన్‌ చంద్రలు నటిస్తున్నారు. ఈ ముగ్గురిలో ప్రశాంత్‌కి జోడీ స్నేహ అయితే మిగిలిన ఇద్దరికి కూడా జోడీలు ఉన్నాయి. అంటే ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ ముగ్గురు అన్నయ్యలు, ముగ్గురు వదినల ముద్దుల మరిదిగా నటిస్తున్నాడు. ఈ చిత్రం గతంలో చిరంజీవి హీరోగా విజయ బాపినీడు దర్శకత్వంలో విజయశాంతి, నిర్మలమ్మ, శరత్‌కుమార్‌, సుధ, మురళీమోహన్‌ వంటి వారు నటించిన 'గ్యాంగ్‌ లీడర్‌' తరహాలో ఉండనుందని సమాచారం. మాస్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌ని కూడా బాగా పండించే బోయపాటి శ్రీను తన గత చిత్రం 'జయజానకి నాయకా' చిత్రం సరిగా ఆడక పోవడంతో కసిమీద ఉండగా, రామ్‌చరణ్‌ 'రంగస్థలం' ఊపులో ఉన్నాడు. 

Advertisement
CJ Advs

ఇక ఇందులో చరణ్‌కి పెద్ద వదినగా నటిస్తున్న స్నేహ మాత్రం ముఖస్తుతి కోసం అందరి పేర్లు చెప్పి తనకు ఇష్టం అనకుండా నాగార్జున, అల్లుఅర్జున్‌, రామ్‌చరణ్‌ల నటన అంటే నాకెంతో ఇష్టం. వారి నటన చాలా హ్యాపీగా ఉంటుంది. శ్రీరామదాసు చిత్రంలో నాగార్జున నటన అద్భుతమని దానిని మరిచిపోలేనని చెప్పింది. మరోపక్క ఈమె ఆల్‌రెడీ అల్లుఅర్జున్‌ నటించిన 'సన్నాఫ్‌ సత్యమూర్తి'లో నటించింది. ప్రస్తుతం రామ్‌చరణ్‌తో చేస్తోంది. దాంతో ఆమె ఈ ముగ్గురి పేర్లే చెప్పిందని కొందరు అంటుంటే, స్నేహ ఇతర స్టార్స్‌తో కూడా చేసిందని, మరీ ముఖ్యంగా బాలకృష్ణ నటించిన 'పాండురంగడు'లో యాక్ట్‌ చేసినా బాలయ్య పేరు మాత్రం చెప్పకపోవడం గమనార్హం అంటున్నారు. ఇక తాను ప్రతిరోజు యోగా, వాకింగ్‌ చేస్తానని కాబట్టే తాను ఎంతో ఉత్సాహంగా ఉంటానని చెప్పుకొచ్చింది. నాకు ప్రత్యేకంగా ఎవ్వరూ రోల్‌మోడల్స్‌ లేరు. నాకు నేనే రోల్‌మోడల్‌ని అని అంటోంది స్నేహ. 

Actress Sneha Told about her Favorite Heroes in Tollywood:

I Like Ramcharan, Nagarjuna And Allu Arjun, Says Actress Sneha
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs