Advertisement
Google Ads BL

జ్యోతిలక్ష్మికి ఏమైంది..!


ఒకప్పుడు వరుస చిత్రాలతో చార్మి ఎంతో బిజీగా ఉండేది. 'అనుకోకుండా ఒకరోజు, మంత్ర' వంటి లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలతో పాటు స్టార్‌ హీరోల చిత్రాలలో ఐటం సాంగ్స్‌, ఇతర ప్రత్యేక పాత్రలు చేసింది. కానీ ఆ కథ నిన్నటిది. ప్రస్తుతం కూడా ఆమెకి ఐటం సాంగ్స్‌, ప్రత్యేక పాత్రలైతే వస్తాయి. కానీ ఆమె మాత్రం ఇక తన నటనకు బై చెప్పినట్లే కనిపిస్తోంది. కేవలం పూరీజగన్నాథ్‌కి చెందిన చిత్రాల ప్రొడక్షన్‌ పనులు, పూరీ కనెక్ట్స్‌ పేరుతో కాస్టింగ్‌ ఏజెన్సీ పనులను చేసుకుంటోంది. ఆమె పర్సనల్‌ లైఫ్‌ని ఎక్కువగా బయటికి తెలియనివ్వడం లేదు. ఎప్పుడైనా సోషల్‌ మీడియాలో కనిపించినా కూడా అది పూరికి చెందిన విషయమో, లేక పూరీ ప్రస్తుతం తన కుమారుడు ఆకాష్‌ పూరీని హీరోగా పెట్టుకుని తీస్తున్న 'మెహబూబా' చిత్రం అప్ డేట్స్ తో మాత్రమే దర్శనమిస్తోంది. 

Advertisement
CJ Advs

ఇక ఇటీవల రాంగోపాల్‌వర్మ శ్రీదేవిని హోంథియేటర్‌లో చూస్తూ పక్కనే వోడ్కా గ్లాస్‌తో కనిపించే ఫొటోలు, వీడియోతో శ్రీదేవి భక్తుడు అని తెలిపింది. తాజాగా మాత్రం ఆమె షాక్‌ ఇచ్చింది. 'పైసావసూల్‌' చిత్రంలో నటించిన కొత్తమ్మాయి ముస్కాన్‌సేధీ తాజాగా హైదరాబాద్‌లో ఓ ఫొటో షూట్‌లో పాల్గొంది. ఆమెని కలిసి మాట్లాడి చాలా కాలం కావడంతో ఆ ఫొటోషూట్‌కి చార్మి కూడా వెళ్లింది. అక్కడ ఆమె ఎడమచేతికి పెద్ద కట్టుతో కనిపిస్తోంది. ఇక పనిలో పనిగా ముస్కాన్‌సేథ్‌ చార్మితో కట్టుతోనే ఫొటో దిగి దానిని సోషల్‌మీడియాలో షేర్‌ చేసింది. అంతేకాదు.. 'గెట్‌ వెల్‌ సూన్‌ మేడమ్‌'ని తెలిపింది. ఇంతకీ చార్మి ఎడమ చేతికి ఏమైంది? గాయం ఎలా జరిగింది? అనేది అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తోంది.

Heroine Charmee hand injured:

Charmee hand injured pic Hulchal in social media
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs