Advertisement

ట్రెండ్ సెట్టర్స్ గా.. టాలీవుడ్ హీరోలు!


 

Advertisement

 

ఈ మధ్యన సినిమా విడుదల తేదీలు చాలా దూరంలో ఉన్నా కూడా అప్పుడే టీజర్స్, ఫస్ట్ లుక్ లతో తెగ హడావిడి మొదలు పెట్టేస్తున్నారు. ఏదో సినిమాకి విడుదలకు 15  రోజుల ముందు ఒక ట్రైలర్ ని విడుదల చేసేవారు. కానీ ఇప్పుడు ఆ ట్రైలర్ కన్నా ముందు టీజర్స్, సాంగ్స్ అంటూ ఒక్కొక్కటిగా మార్కెట్ లోకి విడుదల చేస్తూ సినిమాపై విపరీతమైన బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఒక్కోసారి రెండేసి టీజర్స్ వదులుతూ అందరి దృష్టి తమ సినిమాల మీదకి మలచుకుంటున్నారు. అందులో భారీ బడ్జెట్ సినిమాల విషయంలో ఈ టీజర్, సాంగ్స్ విడుదల చేసే కాంపిటీషన్ మాత్రం ఎక్కువగా ఉంది. ఫస్ట్ లుక్స్ తో పాటే... పండగలొచిన్నప్పడు కూడా పండగ స్పెషల్ పోస్టర్స్ వదులుతూ నానా రచ్చ చేస్తున్నారు.

ఇప్పుడు ఇదే ట్రెండ్ ను ముగ్గురు స్టార్ హీరోలు ఫాలో అవుతున్నారు. వారిలో 'రంగస్థలం'తో రామ్ చరణ్ రచ్చ అయితే మాములుగా లేదు. ఇప్పటికే  రెండు పాటలు, రెండు టీజర్స్ తోపాటు... చిట్టి బాబు, రామలక్ష్మిల లుక్స్ జనంలోకి చొచ్చుకుపోయాయి. మరి చరణ్ సినిమా మార్చి నెలాఖరులో ఉన్నప్పటికీ గత రెండు నెలలుగా రంగస్థలం గురించి మార్కెట్ లో బాగా ట్రెండ్ అవుతుంది. అలాగే ఏప్రిల్ చివరినా, మే నెల మొదట్లో రాబోయే మరో ఇద్దరు స్టార్ హీరోల హంగామా కూడా షురూ అయ్యింది. మహేష్ బాబు - కొరటాల శివ 'భరత్ అనే నేను' పోస్టర్స్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటే... అల్లు అర్జున్ 'నా పేరు సూర్య' మొదటి ఇంఫాక్ట్.. అలాగే పోస్టర్ ఇంఫెక్ట్ అంటూ రచ్చ మొదలెట్టేశాడు.

మరి సినిమాల మీద హైప్ క్రియేట్ చెయ్యడానికి ఈ దర్శక నిర్మాతల ప్లాన్స్ బాగానే వర్కౌట్ అవుతున్నాయి కూడా. ఇలా సినిమా విడుదలకు ముందుగా అంటే చాలా ముందు నుండే తమ సినిమా  ప్రమోషన్స్ మొదలెట్టేసి... తమ సినిమాల మీద మార్కెట్ లోను, ప్రేక్షకుల్లోనూ విపరీతమైన బజ్ క్రియేట్ చేస్తూ సినిమా మార్కెట్ ని విస్తరిస్తున్నారు స్టార్ హీరోలు. మరి ఆ ట్రెండ్ తోనే ప్రేక్షకులకు కూడా ఆ సినిమాలు ఎప్పుడు విడుదలవుతాయి అని ఆసక్తిగా ఎదురు చూసేలా చేస్తున్నాయి. ఇక టీజర్స్, పోస్టర్స్, పాటలతో నానా హంగామా చేస్తూ వీళ్ళు ట్రైలర్ రిలీజ్ అంటూ కంక్లూజన్ ఇచ్చేస్తూ.. ఆడియో వేడుకల బదులు.. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి శ్రీకారం చుడుతున్నారు. మరి ఈ ట్రెండ్ ఎన్నాళ్ళు ఉంటుందో చూడాలి.

New Trend Runs in Tollywood:

Tollywood Heroes Turned Trend Setters
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement