Advertisement

చరణ్ ఫ్యాన్స్‌కి థ్యాంక్స్ చెప్పిన ఉపాసన!


మొత్తానికి ఫస్ట్‌లుక్‌, 1980ల కాలం నాటి వస్తువుల పిక్స్‌ ద్వారా సమ్‌థింగ్‌ స్పెషల్‌గా సుకుమార్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ నటించే 'రంగస్థలం 1985' ఉంటుందని అర్ధమవుతూనే ఉంది. మరోవైపు ఇందులో రామ్‌చరణ్‌ పక్కా మాస్‌ గెటప్‌లో లుంగీ కట్టి, తువాలు వేసుకున్న స్టిల్స్‌ మంచి కిక్కునిచ్చాయి. ఇక ఇందులో ఆయన చెవిటివాడుగా కనిపిస్తాడని కూడా మొదటి నుంచి వార్తలు వస్తున్నాయి. అవన్నీ ఇప్పుడు నిజమయ్యాయి. ఇందులో రామ్‌చరణ్‌ ఇంజనీర్‌ చిట్టిబాబు పాత్రను చేస్తున్నాడు. ఈయన సౌండ్‌ ఇంజనీర్‌ కూడా. అంటే చెవిటివాడు. ఆయనకు మాటలు వినబడకపోయినా మాటలు చూస్తాడట. అంటే సాధారణంగా చెవిటి వారికి ఉండే లిప్‌ మూమెంట్‌ని చదివేసే కళ ఈయనకు ఉంటుంది. 

Advertisement

ఇక చిత్రం యూనిట్‌ ముందుగా చెప్పినట్లే రధసప్తమి రోజున టీజర్‌ని విడుదల చేసింది. గోదావరి అందాలు, పల్లెటూరి బ్యాక్‌గ్రౌండ్‌, ముఖ్యంగా కొడవలి పట్టుకుని వస్తున్నప్పుడు దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన మ్యూజిక్‌, రత్నవేలు ఫొటోగ్రఫీ వంటివి 'రంగస్థలం' టీజర్‌కి నిండుతనం తెచ్చాయి. ఇక ఇప్పుడు ఇండియాలోనే ఈ చిత్రం టీజర్‌ టాప్‌ ట్రెండింగ్‌లో ఉంది. ఇందులో సమంత పాత్ర గురించి ఏమీ చెప్పలేదు. ఆమె బర్రెలు, గేదెలు తోలే పనిమనిషిగా కనిపించనుంది. ఇక ఈ టీజర్‌ విడుదలతో మెగాభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ట్రైలర్‌ విడుదలయ్యే వరకు వారికి ఇదే విందు భోజనం కానుంది. 

ఇక ఈ టీజర్‌ విడుదల సందర్భంగా అభిమానులు రామ్‌చరణ్‌ ఇంటి ముందు ఆయన పోస్టర్‌ని ఉంచి టపాసులతో నానా హంగామా చేశారు. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే రామ్‌చరణ్‌ సతీమణి ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసి, అభిమానులు చూపిస్తున్న ఆదరణ మర్చిపోలేనిదని చేసిన ట్వీట్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. మరి మార్చి 30న విడుదలయ్యే ఈ చిత్రం రామ్‌చరణ్‌, సుకుమార్‌, సమంత, మైత్రి మూవీ మేకర్స్‌కి ఎలాంటి హిట్‌ని అందిస్తుందో వేచిచూడాల్సివుంది...! 

Upasana Says Thanks to Charan Fans:

Outside our home today Mr C ???? Thanks guys for all ur love. Hope u like the teaser, Tweeted Upasana
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement