Advertisement

సూర్య ఎంతైనా గొప్పోడే..!


హీరోలకు మరీ ముఖ్యంగా స్టార్స్‌కి అభిమానులను సంపాదించుకోవడమే కాదు..వారి చేష్టలపై నిత్యం పరిశీలన చేసి, వారిని తమ మాట వినేటట్లు చేసే నియంత్రణ కూడా ఉండాలి. అభిమానులకు కూడా ఇది తప్పు.. ఇది కరెక్ట్‌ అని చెప్ప గలిగే దైర్యం ముఖ్యం. తన ఫ్యాన్స్‌ తనని చెడ్డగా అనుకుంటారేమోనన్న భయం ఉండకూడదు. అప్పుడు కధానాయకుడు నిజజీవితంలో కూడా 'నాయకుడు' అనిపించుకుంటాడు. ఫలానా హీరో ఫ్యాన్స్‌ అంటే ఉన్మాదులు, సినిమా పిచ్చి ఉన్న వారు, పోరంబోకులు కాదని వారికి ఎంతో మంచి తనం ఉందని గర్వించేలా అభిమానులు ఉండాలి. ఇటీవల తాను చేసిన 'గ్యాంగ్‌' చిత్రం రిలీజ్‌ వేడుకల్లో అభిమానులను స్టేజీపైకి పిలిచి వారితో డ్యాన్స్‌ చేసిన సూర్య తన కాళ్లకు పాదాభివందనం చేయబోయిన వారికి తిరిగి తనే పాదాభివందనం చేసిన సీన్‌ ఎప్పటికీ మర్చిపోలేం.

Advertisement

తాజాగా ఆయన అభిమానుల విషయంలో మరో అడుగు ముందుకేశాడు. తమ చిత్రాలు బాగా లేవనే టాక్‌వచ్చిన సినిమాని కాపాడి, కాస్తైనా వాటిని ప్రమోషన్‌ కూడా చేయని బాధ్యతరాహిత్యం ఉన్న తెలుగు హీరోల కన్నా, ప్రమోషన్‌ మీద సినిమాలు ఆడవని తెలిసినా తన వంతు కృషి చేస్తూ సూర్య తెలుగు రాష్ట్రాలలో పలు థియేటర్లకు వెళ్లాడు. తాజాగా ఆయన చెన్నైలో 'గ్యాంగ్‌' సక్సెస్‌మీట్‌ సందర్భంగా బైక్‌ ర్యాలీని తన అభిమానులతో నిర్వహించాడు. అయితే ఈ బైక్‌ ర్యాలీలో తన అభిమానులు హెల్మెట్‌ ధరించడం లేదని గమనించి, కారు దిగి వారికి క్లాస్‌ పీకాడు. హెల్మెట్స్‌ లేకుండా బైక్‌లని ఎలా నడుపుతారు? ఓ బైక్‌ మీద నుంచి ఇద్దరు నా కారు కింద పడబోయారు. మరి అదే వారి ప్రాణాలు పోయి ఉంటే దీనిని తలుచుకుని నేనెంత బాధపడతాను? అంటూ అభిమానులకు దిశానిర్దేశం చేశాడు.

కార్తి కూడా ఇటీవల తన అభిమాని కారు దుర్ఘటనలో మరణిస్తే వెక్కివెక్కి ఏడ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ విషయంలో తన అభిమానులకు మార్గనిర్దేశనం చేసిన సూర్య నిజంగా గ్రేట్‌ అనే చెప్పాలి. ఇక ఓ టీవీఛానెల్‌ విషయంలో ప్రస్తుతం తమిళనాట ఆందోళన సాగుతోంది. ఆ టీవీ ఛానెల్‌ సూర్య హైట్‌ గురించి వెటకారపు సెటైర్‌ వేసింది. సూర్య అమితాబ్‌ పక్కన నటించాలంటే సూర్య బెంచీ మీద నిలుచోవాలి. లేదా అమితాబ్‌ కుర్చీలో కూర్చొవాలి అని వేసిన సెటైర్‌ పట్ల సూర్య అభిమానులతో పాటు హీరో విశాల్‌, 'గ్యాంగ్‌' దర్శకుడు విఘ్నేశ్‌శివన్‌ కూడా మండిపడుతున్నారు.

Suriya greatness again revealed:

Suriya Helmet campaign with Fans
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement