Advertisement
Google Ads BL

అమ్మడూ.. అందరూ చెప్పే కబుర్లేగా ఇవి!


మన సీనియర్‌ స్టార్స్‌కేమో అమ్మడు.. లెట్స్‌ డు కుమ్ముడు అంటూ యంగ్‌హీరోయిన్లతో అందునా తమ మనవరాలి వయసున్న వారితో, ఏకంగా ఇద్దరు ముగ్గురుతో రొమాన్స్‌చేస్తూ, వీలుంటే ఓ ఐటం సాంగ్‌ అనో, స్పెషల్‌ సాంగ్‌ అనో మరొకరితో కూడా చిందులేయాలని ఆశ. పెరుగుతున్న వయసుకి గౌరవం ఇవ్వడం ముఖ్యం. ఈ విషయంలో కాస్త నాగార్జున, వెంకీలు మాత్రమే తమ వయసును గ్రహిస్తున్నారు. మిగిలిన వారు మాత్రం నవమన్మథులుగా నిలిచిపోవాలని, కుర్రహీరోయిన్ల వల్ల తమ వయసుని కూడా తగ్గించుకోవాలని భావిస్తూ, మేము ఇప్పటికీ యంగే అని చెబుతుంటారు. 

Advertisement
CJ Advs

ఇక బాలకృష్ణ సరసన నటించిన యంగ్‌ హీరోయిన్లు ఎవ్వరూ ఆ తర్వాత పెద్దగా రాణించలేక యంగ్‌ స్టార్స్‌ సరసన అవకాశాలు రాక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. 'పాండురంగడు'లో భగవంతుడైన బాలకృష్ణకి ఇష్టసఖిలుగా నటించిన అందరూ ఫేడవుట్‌ భామలే. చివరికి యంగ్‌ హీరోయిన్‌ సుహాసిని కూడా తర్వాత ఛాన్స్‌లు రాక నాగబాబుతో కలిసి టీవీ సీరియల్స్‌తో 'అపరంజి'తో సరిపెట్టుకుంది. ఇక నాటి నుంచి 'పైసావసూల్‌' వరకు ఇదే వరస. ఇప్పుడు ఆ కోవలోకి మరో నటి వచ్చి చేరుతుందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. 

ఇక్కడి యంగ్‌ హీరోయిన్లు ఆయనతో చేయరు కాబట్టి ఎప్పటికప్పుడు ముంబై నుంచి భామలను దిగుమతి చేసుకోవడం, ఎత్తిపోతల పథకం చేపట్టడం బాలయ్యకి అలవాటే. 'పిల్లజమీందార్‌'తో తన నటనను, అందాన్ని హరిప్రియ ప్రూవ్‌ చేసుకోవడం, మరోవైపు ఈమెకి కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో కూడా క్రేజ్‌ ఉండటం. సాధారణంగా హీరోయిన్లని పొగడని బాలయ్య.. హరిప్రియ వంటి నటిని సింగల్‌టేక్‌ ఆర్టిస్ట్‌గా చెప్పడంతో 'జైసింహా'లో ఎలాగూ నయనతార, హరిప్రియలదే మెయిన్‌ అని తెలిసిపోతోంది. 

కానీ ఈ చిత్రంలో అలా వచ్చి ఇలా వెళ్లి, కాసేపు స్టెప్‌లేసిన నటాషాదోషి మాత్రం ఈ చిత్రం గురించి చాలా కథల్ని చెబుతోంది. ఈ పాత్ర కోసం 100 మంది అమ్మాయిలను చూసి చివరకు నన్ను ఓకే చేశారు. నా తల్లిదండ్రులు మలయాళీ, గుజరాతీ. నేను డాక్టర్‌ని, డెంటిస్ట్‌ని. ఇక ఈ చిత్రం కథ, పాత్ర నాకేంతో నచ్చాయి. బాలయ్య గారు నిజంగా బుక్‌ ఆఫ్‌ నాలెడ్జ్‌, తన తండ్రి గురించి ఎంతో గొప్పగా చెబుతారు. తన తండ్రి నటించిన చిత్రాలను నాకు తన ఐప్యాడ్‌లో చూపించేవారు అని చెబుతోంది. సరేలే. అమ్మడు.. ప్రస్తుతానికి ఇంటర్వెల్‌ తీసుకుని, తర్వాత పరిస్థితి ఏమిటి? అనేది ముందుగా ఆలోచించుకుంటే మంచిది!

Natasha Doshi About Balakrishna:

Jai Simha Heroine Praises Nandamuri Balakrishna
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs