Advertisement

అల్లు అర్జున్ అప్పుడే 100 కోట్ల మార్క్..!


ఈమధ్యన స్టార్ హీరోల సినిమాలన్నీ 75 కోట్లకి పై మాటే బిజినెస్ చేస్తున్నాయి. 50  కోట్ల క్లబ్ నుండి... 80 కోట్ల క్లబ్ లోకి.. అక్కడనుండి 100 కోట్ల క్లబ్బుకి అక్కడి నుండి 125 కోట్ల క్లబ్బుకి ఆతర్వాత 150 కోట్ల క్లబ్బుకి చేరిపోయాయి. ఆ రేంజ్ లో బిజినెస్ పెరగడంతో పాటే.. స్టార్స్ యొక్క పారితోషికాలు పెరిగిపోయాయి. ఇప్పటికే ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్ అత్యధిక పారితోషికాల లిస్ట్ లో వున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్.. రేసు గుర్రం, సరైనోడు, డీజే సినిమాల హిట్స్ తో  క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ క్రేజ్ తోనే అల్లు అర్జున్ సినిమాలు కూడా మంచి బిజినెస్ చేస్తున్నాయి. ఆ బిజినెస్ తోపాటు అతని రెమ్యునరేష్ కూడా బాగా పెరిగింది.

Advertisement

అల్లు అర్జున్ గత సినిమా డీజే దువ్వాడ జగన్నాధం 60  నుండి 70  కోట్ల మధ్యన బడ్జెట్ పెడితే.. ఇప్పుడు వక్కంతం వంశీ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో నటిస్తున్న నా పేరు సూర్య సినిమా కూడా దాదాపుగా 80  కోట్ల బడ్జెట్ నిర్మాతలు పెడుతున్నారని టాక్ బయటికి వచ్చింది. అయితే ఈ బడ్జెట్ లో సగం నటీనటులకు, టెక్నీషియన్స్  కే సరిపోతుంది. అలాగే ప్రొడక్షన్ పరంగా అల్లు అర్జున్ కెరీర్లోనే అత్యధికంగా ఈ చిత్రానికి ఖర్చు చేస్తున్నారట. మరి దేశవ్యాప్తంగా అనేక లొకేషన్స్ లో సినిమాని భారీగా తెరకెక్కిస్తున్నారు.

మరి 80 కోట్ల బడ్జెట్ అంటే ఏ రేంజ్ లో బిజినెస్ ఉండాలి అంటే... 100 కోట్ల బిజినెస్ జరగాలి. అయితే ఇప్పటికే నిర్మాతలు నా పేరు సూర్య కి 80  కోట్ల బడ్జెట్ పెట్టి 100  కోట్ల బిజినెస్ చేసి 20 కోట్లు టేబుల్ ప్రాఫిట్ అందుకున్నట్టుగా చెబుతున్నారు. అయితే నా పేరు సూర్య  శాటిలైట్.. డిజిటల్ హక్కులు ద్వారా 25 కోట్ల రూపాయలు వస్తున్నట్టుగా సమాచారం. ఇక ఆంధ్రప్రదేశ్ అంతటా కలిపి 40 కోట్ల దాకా బిజినెస్ అవుతోందట. అలాగే నైజాం రైట్స్ రూ.20 కోట్ల దాకా పలికే అవకాశముంది అని అంటున్నారు. ఇంకా ఓవర్సీస్ రైట్స్ ఉన్నాయి. మొత్తంగా బిజినెస్ ఈజీగా వంద కోట్లు దాటిపోతుంది కాబట్టి నిర్మాతలు లగడపాటి శ్రీధర్.. బన్నీ వాసు లు 20 కోట్ల పైనే లాభాలు అందుకోనున్నారని అంటున్నారు.

Allu Arjun Naa Peru Surya Reaches 100 Crores Pre Release Business:

Allu Arjun In 100 Crores Mark with Naa Peru Surya Naa Illu India Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement