Advertisement

'అర్జున్‌రెడ్డి' నీ సీక్రెట్ తెలిసిపోయింది!


నాని తర్వాత తెలుగులో ప్రస్తుతం ప్రకంపనలు, సంచలనాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా 'అర్జున్‌రెడ్డి'గా నటించిన విజయ్‌దేవరకొండని చెప్పుకోవచ్చు. మొదట 'పెళ్లిచూపులు'తో సింపుల్‌ ప్రేమకథను, తర్వాత 'అర్జున్‌రెడ్డి'తో బోల్డ్‌ లవ్‌స్టోరీని చేసిన ఈయన ప్రస్తుతం రెండు చిత్రాలు చేస్తున్నాడు. ఒకటి పరుశురాం దర్శకత్వంలో చేస్తున్న చిత్రంలో కన్నడభామ రష్మికా మండన్న నటిస్తోంది. మరోవైపు రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో మరో చిత్రం చేస్తున్నాడు. ఇవి కాక ఆయన చేతిలో మరో నాలుగైదు ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. ఇక తాజాగా ఆయన 'మహానుబాహుడు, రాజా దిగ్రేట్‌' చిత్రాలలో విజయవంతమైన హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న మెహ్రీన్‌తో కలిసి హోళీ ఆడుతూ ఉన్న సెల్ఫీ ఒకటి సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేసింది. 

Advertisement

వీరిద్దరు కలసి ఏం ప్రాజెక్ట్‌ చేస్తున్నారా? అని పలువురు ఆలోచనలో పడ్డారు. ఇక ఆమెతో ఆయన పరుశురాం చిత్రంలో ఏమైనా స్పెషల్‌సాంగ్‌ చేస్తున్నాడా? అనే అనుమానాలు కూడా వచ్చాయి. వీటిని మెహ్రీన్‌ కూడా సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది. కాగా ఈ పాట సినిమా కోసం కాదని, ఈ నెల 15 వ తేదీ నుంచి 20వ తేదీ వరకు హైదరాబాద్‌లో జరుగనున్న ఐదవ తెలుగు మహాసభల కోసం ప్రత్యేకంగా చిత్రీకరిస్తున్న సాంగ్‌ అనే క్లారిటీ వచ్చింది. ఈ ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. 1975లో మొట్టమొదటి ప్రపంచ తెలుగు మహాసభలో హైదరాబాద్‌లోనే జరిగాయి. తర్వాత రెండు, మూడు సభలను మలేషియా, మారిషస్‌లోని ప్రవాసాంద్రులు తమ దేశాలలో జరిపారు. మరలా 4వ ప్రపంచ తెలుగు మహాసభలు తిరుపతిలో జరిగాయి. ప్రస్తుతం ఐదవ ప్రపంచ మహాసభలకు హైదరాబాద్‌ మరోసారి వేదికగా నిలువనుంది. 

ఇక దీని కోసం దర్శకులు వంశీపైడిపల్లి, హరీష్‌శంకర్‌లు తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిచేలా కొన్ని పాటలను చిత్రీకరిస్తున్నారు. తాజాగా వంశీపైడిపల్లితో విజయ్‌దేవరకొండ, మెహ్రీన్‌, ఈషా హెబ్బాలు నటిస్తున్న ఈ హోలీ సాంగ్‌ దాని కోసమే అర్ధమైంది. ఈ పాట యూనిట్‌తోతాను దిగిన ఫోటోలను విజయ్‌దేవరకొండ పోస్ట్‌ చేయడంతో వీటిపై ఓ క్లారిటీ వచ్చింది. 

Vijay Devarakonda Mehrene Photo Secret Revealed:

Arjun Reddy Mehrene Holy Photo Sensation in Social Media 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement