Advertisement

పవన్ ఎవ్రీ డే హీరో ఇతనేనంట!


ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవితో కలిసి పనిచేయాలని, ఆయన రాజకీయంగా మంచి నిర్ణయాలు తీసుకుంటాడనే దృష్టిలో పలు కులాలకు చెందిన మేధావులైన డాక్టర్‌ మిత్ర, పరకాల ప్రభాకర్‌, సంతానం, జెపి కూడా ఆయనకు విలువ ఇచ్చి ఎంతో మంచి సూచనలు చేశారు. కానీ చిరుపై కాపు ముద్ర పడటంతోనే ఆయన ఓడిపోయాడు. ఈ విషయాన్ని తాజాగా పోసాని కూడా ఒప్పుకున్నాడు. ఇక ఇప్పుడు పవన్‌ వంతు వచ్చింది. చాలా మంది మాత్రం చిరంజీవి కంటే పవన్‌ కళ్యాణ్‌ వ్యక్తిగతంగా మంచి ఆలోచనా పరుడు, మంచి భావాలున్న వ్యక్తిగా భావిస్తున్నారు. కానీ కొందరు మాత్రం ఫ్యాన్స్‌ పేరుతో ఆయనకు కూడా కులం గజ్జి అంటిస్తున్నారు. ఇందులో ఆయన తప్పు లేకపోయినా ఆయనపై ఆ ముద్ర పడితే కష్టమే. అయితే పవన్‌ తన మనస్తత్వానికి దగ్గరైన వారినే చేరదీస్తాడని అంటారు. మరి బండ్లగణేష్‌, శరత్‌మరార్‌ వంటి వారిని ఆయన ఎందుకు చేరదీశాడో ఎవ్వరికీ తెలియదు. 

Advertisement

కాగా ఇటీవల జన సేన సైనికుడైన ఓ అభిమానిని పిలిచి మరీ ఫొటో తీసుకుని ఆయన భావాలు తనకెంతో నచ్చాయని ఎంతో గర్వంగా చెప్పాడు. కాగా ఇప్పుడు మరో మంచి భావాలున్న ముస్లింను పొగుడూతూ ఆయన్ను 'ఎవ్రీ డే హీరో'గా పేర్కొన్నాడు. అవార్డు తీసుకోవడం కోసం లండన్‌కి వెళ్లిన పవన్‌ అవార్డుని అందుకుని అక్కడి సంగతులను సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నాడు. హకీం అనే ఓ వ్యక్తితో దిగిన ఫోటోని పోస్ట్‌ చేసి, ఈయన హకీం. బంగ్లాదేశస్తుడు. ఎప్పుడో వచ్చి లండన్‌లో స్దిరపడ్డాడు. నేను ఎప్పుడు లండన్‌ వెళ్లినా ఆయనే నన్ను తన కారులో ఎక్కించుకుని లండన్‌ వీధులన్నీ చూపిస్తాడు. ఇక ఆయన నాతో పెద్దగా ఏ విషయంపై మాట్లాడే వాడు కాదు. 

కానీ తాజాగా మాత్రం నా రాజకీయ ప్రస్థానం విషయంలో ఎన్నో విలువైన సూచనలు చేశాడు. మహిళల రక్షణ, గృహహింస, సీనియర్‌ సిటిజన్లకు కల్పించాల్సిన ప్రాధాన్యతల గురించి నాకు విలువైన సూచనలు చేశాడు. ఆయన చెప్పిన సూచనలన్నింటినీ ఆచరిస్తానని నేను ఆయనకు మాట ఇచ్చాను. గాంధీ గురించి ఆయన మాట్లాడితే నన్ను ఎంతో కదిలించింది . ఆయన ముస్లిం కావడంతో ఇటీవల మక్కా వెళ్లివచ్చాడట.. ఏ మతమైనా హింసను ప్రేరేపించమని చెప్పదని ఆయన చెప్పారని పవన్‌ తెలిపాడు. ఇలాంటి నిజాలు మాట్లాడే వారందరూ తనకు గురుతుల్యులని పవన్‌ చెప్పడం చూస్తే నిజంగా ఇలాంటి ఉన్నత భావాలను అభిమానుల్లోకి తీసుకెళ్లి ముందుగా తన ఫ్యాన్స్‌లోనే ఉన్న కుల, మత పచ్చిగాళ్లకి కాస్త పవన్‌ బుద్ది చెబితే బాగుండు అనిపిస్తోంది. 

Pawan Kalyan Speak about His Everyday Hero :

Pawan Kalyan revealed who is his everyday hero to the World with a series of tweets on his social networking page
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement