Advertisement

చిరు సోదరుడు.. ఏం రాదని ఒప్పేసుకున్నాడు!


ప్రతి మనిషిలోనూ పుట్టుకతోనే కొన్ని నైపుణ్యాలను భగవంతుడు ప్రసాదిస్తాడు. వాటికి మెరుగుపెట్టి తమ ప్రతిభను కృషితో బయటకు తీసుకొచ్చి విజయం సాధించే బాధ్యత మాత్రం ఆ వ్యక్తిదే. ఇక పుట్టుకతోనే వచ్చే నైపుణ్యాలు అంటే జీన్స్‌ ద్వారా వచ్చేవి. తమ తండ్రులు, తాతలు, తమ సోదరులు.. ఇలా వారు రాణించిన రంగాలలో వచ్చి రాణించడం అనే బ్యాగ్రౌండ్‌ అనే అదృష్టాన్ని కూడా దేవుడే కలిపిస్తాడు. ఇక మెగాబ్రదర్‌ నాగబాబు విషయానికి వస్తే చిరంజీవి సోదరునిగా ఆయనకు 'మరణమృదంగం'తో పాటు చిరంజీవి నటించిన చిత్రాలతో పాటు పూరీజగన్నాథ్‌తో పాటు ఇతర దర్శకుల చిత్రాలలో కూడా మంచి పాత్రలే వచ్చాయి. 

Advertisement

ఇక ఆయన తన కెరీర్‌ ప్రారంభంలోనే ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో '420' అనే పూర్తి హాస్యరస చిత్రం చేశాడు. ఈ చిత్రం బాగా ఉన్నప్పటికీ ఎందుకో తెలియదు గానీ జనాలను అది రీచ్‌ కాలేదు. దాంతో ఆ చిత్రంలోని కోట, బట్టల సత్యం ఎపిసోడ్‌నే మరలా ఇవివి తన 'హలో బ్రదర్‌'లో వాడుకుని హిట్‌ కొట్టాడు. ఇక చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడైతే నాగబాబు హీరోగా దాదాపు డజన్‌ చిత్రాలు వచ్చాయి. కానీ ఏదీ ఆడలేదు. ఇక విషయానికి వస్తే తనకు చిన్నతనం నుంచి నటన అంటే ఇష్టం లేదని నాగబాబు చెప్పాడు. 

కేవలం తన సోదరుడు చిరంజీవి ప్రోత్సాహంతో నటించానే గానీ తనకు నటనంటే ఇష్టం లేదని చెబుతున్నాడు. ఇక తాను నిర్మాతగా మారినప్పుడు చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌, రామ్‌చరణ్‌ వంటి వారు తనకు సినిమా చేసి తనకు తోడ్పాటునందించారని తెలిపాడు. అల్లుఅరవింద్‌ కూడా ఎంతో సపోర్ట్‌ చేశాడని చెబుతూ, అయినా తాను నిర్మాతగా సక్సెస్‌ కాలేకపోయానని, తనలో నిజమైన ప్రొడ్యూసర్‌ లేకపోవడమే దానికి కారణమై ఉండవచ్చని చెప్పుకొచ్చాడు. 

దీంతో నాగబాబు తనకు ఏ టాలెంట్‌ లేదని ఒప్పేసుకున్నట్లు అయ్యింది. నటునిగా తనకు ఇష్టం లేదని, నిర్మాతగా తనకు చేతకాదని చెప్పుకుంటే ఆయనకు ఇష్టం ఉన్న రంగం ఏది? దానిలోనైనా రాణించాడా? లేక ఎల్లకాలం సోదరులు చుట్టూ తిరుగుతూ, వారిని విమర్శించే వారిపై ఉదాహరణకు యండమూరి, రాంగోపాల్‌వర్మ, కత్తి మహేష్‌ వంటి వారిని విమర్శించడం ఒక్కటే ఆయనకు వచ్చా...! అనే సెటైర్లు వినపడుతున్నాయి. 

Nagababu agreed his Failure:

What is the Nagababu Strength?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement