Advertisement
Google Ads BL

'హాలీ హాలీ హాలిబీ' టాక్ ఇలా వుంది..!


మురుగదాస్ - మహేష్ బాబు కలయికలో తెరకెక్కుతున్న 'స్పైడర్' పాటలు హరీష్ జై రాజ్ నేతృత్వంలో రూపుదిద్దుకున్నాయి. హరీష్ కంపోజ్ చేసిన 'స్పైడర్' పాటలు ఒక్కొక్కటిగా మార్కెట్ లోకి విడుదల చేస్తుంది చిత్ర బృందం. ఆ మద్య 'బూమ్ బూమ్' అనే సింగిల్ ని విడుదల చేసి సినిమాపై ఆసక్తి పెంచిన స్పైడర్ టీమ్.. ఇప్పుడు మహేష్ బాబు - రకుల్ ప్రీత్ సింగ్ లపై వచ్చే ఒక పాటను విడుదల చేశారు.  'పుచ్చకాయ పుచ్చకాయ పెదవితీపి నాకు ఇచ్చుకోవే ఇచ్చుకోవో...' అంటూ సాగే పాటతోపాటే ఆ సాంగ్ మేకింగ్ ని కూడా విడుదల చేసింది చిత్ర యూనిట్.

Advertisement
CJ Advs

ఆ పాటలో మహేష్ - రకుల్ ప్రీత్ ల కాంబినేషన్ అదిరిపోయిందనే చెప్పాలి. మహేష్ మాత్రం ఈ పాటలో క్లాస్ లుక్ తో అదిరిపోయే అందంతో కనబడుతుండగా... రకుల్ కూడా వైట్ డ్రెస్ వేసుకుని అందంలో మహేష్ కి గట్టి పోటీ ఇచ్చింది. ఇక ఆ సాంగ్ విజువల్స్ చూస్తుంటే దర్శకుడు మురుగదాస్ ని మెచ్చుకోవాలనిపించే రీతిలో వున్నాయి. ఇక ఆ సాంగ్ మేకింగ్ లో మహేష్ కూతురు సితార చేసే అల్లరి మహేష్ తో కలిసి సితార ఫొటోస్ దిగడం వంటి వాటితో స్పైడర్ 'హాలీ హాలీ హాలిబీ' పాట మేకింగ్ అదరగొట్టేసింది.

ఇక హరీష్ జైరాజ్ ఈ సాంగ్ కి మ్యూజిక్ అదరగొట్టేసినప్పటికీ పాట మాత్రం తమిళ స్టయిల్లో ఉందనే కామెంట్స్ వినబడుతున్నాయి. తమిళ పాట డబ్ చేస్తే తెలుగులో విన్నట్టుంది అంటున్నారు కొందరు. ఇకపోతే తెలుగులో 'స్పైడర్' ఆడియో వేడుకని రద్దు చేసి 'స్పైడర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గట్టిగా ప్లాన్ చేస్తున్న 'స్పైడర్' టీమ్ తమిళంలో మాత్రం ఆడియో వేడుకని పెద్ద ఎత్తున నిర్వహిస్తుంది. ఇక ఈ చిత్రం దసరా కానుకగా ఈ నెల 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Spyder Hali Hali Halibi song Talk:

Mahesh Babu and Rakul Preet Singh Spyder Second Song Released. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs